Gujarat riots: మోదీకి క్లీన్‌చిట్… జకియా జఫ్రీ పిటిషన్‌ కొట్టివేత….-gujarat riots sc dismisses zakia jafri s plea against sit clean chit to modi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gujarat Riots: మోదీకి క్లీన్‌చిట్… జకియా జఫ్రీ పిటిషన్‌ కొట్టివేత….

Gujarat riots: మోదీకి క్లీన్‌చిట్… జకియా జఫ్రీ పిటిషన్‌ కొట్టివేత….

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 11:18 AM IST

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ క్లీన్ చిట్ ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. జకియా జఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
మోదీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. (HT_PRINT)

గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై జకియాజఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గుజరాత్‌ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీ ఎహ్సన్‌ జఫ్రీ సతీమణి జకియా జఫ్రీ సిట్‌ నివేదికను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ప్రధాని మోదీ సహా 64మంది సిట్‌ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నించారు. 2002 గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్రపై సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు.

జకియా జఫ్రి పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆమె అభ్యంతరాలను తోసిపుచ్చింది. జకియా జఫ్రి పిటిషన్‌పై స్పెషల్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ సమర్ధించారు. 2002నాటికి గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో దర్యాప్తు ముగిస్తూ సిట్‌ ఇచ్చిన నివేదికపై జకియా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్యాప్తు నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం జకియా అభ్యర్థనను తోసిపుచ్చారు. సిట్‌ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.

2002 అల్లర్లలో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన నరమేధంలో ఎంపీ ఎహ్సన్‌ జఫ్రీతో పాటు 68మంది ప్రాణాలు కోల్పోయారు. 2002 ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది. గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ తగులబడి 59మంది ప్రయాణికులు కోల్పోవడంతో చెలరేగిన అల్లర్లలో గుజరాత్‌లో భారీగా ప్రాణనష్టం జరిగింది నాటి అల్లర్లకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రోద్భలంతోనే జరిగాయని ఆరోపిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

IPL_Entry_Point

టాపిక్