Atmakur Bypoll: ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్…. -atmakuru assembly by elections polling on 23rd june in nellore district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Atmakur Bypoll: ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్….

Atmakur Bypoll: ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్….

HT Telugu Desk HT Telugu
Jun 23, 2022 06:37 AM IST

Atmakur Bypoll: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉపఎన్నికకు మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆత్మకూరు బై పోల్
ఆత్మకూరు బై పోల్ (HT)

atmakuru polling: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది . ఈ బైపోల్ కు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఉప ఎన్నికల్లో మొత్తం 279 పోలింగ్ కేంద్రాలలో 1200 మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు.

పటిష్ట భద్రత...

ఉప ఎన్నికలో ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మూడు మిలిటరీ బెటాలియన్లు, ఆరు పోలీస్ పోలీస్ స్పెషల్ ఫోర్స్ టీమ్, ముగ్గురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 36 మంది ఎస్​ఐలు,900 మంది స్థానిక పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల పర్యవేక్షణకు సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

278 పోలింగ్ కేంద్రాలు….

మొత్తం 278 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకటించారు. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాను గుర్తించి అందులో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్నారు. అన్నిచోట్ల వెబ్ క్యాస్టింగ్​కు ఏర్పాట్లు చేశామని... ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను విధుల్లో ఉంచి.. పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మొత్తం 2 లక్షలా 13 వేల మంది ఓటర్లకు స్లిప్​లు అందజేసినట్లు వివరించారు.

ఉదయం 7 గంటలకు పోలింగ్...

గురువారం ఉదయం 7 గంటల పోలింగ్ ప్రారంభం కాగా… సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో కూడా ఉన్నారు.

వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇవాళ ఉపఎన్నిక జరగుతోంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పోలింగ్ కేంద్రాలు - 279

మొత్తం ఓటర్లు - 2,13,338

బరిలోని అభ్యర్థుల సంఖ్య - 14

ఓట్ల లెక్కింపు - జూన్ 26, 2022

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్