October 26 Telugu News Updates : రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు - బాల్క సుమన్-andhra pradesh and telangana telugu live news updates 26th october 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  October 26 Telugu News Updates : రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు - బాల్క సుమన్

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

October 26 Telugu News Updates : రూ. 100 కోట్లు ఆఫర్ చేశారు - బాల్క సుమన్

04:33 PM ISTOct 26, 2022 08:46 PM Anand Sai
  • Share on Facebook
04:33 PM IST

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Wed, 26 Oct 202203:17 PM IST

సంచలనం

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో…. భారీ ఆపరేషన్ కు తెరలేపింది ఓ గ్యాంగ్. అధికార టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సమాచారం. ఒక్కొ ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేసిన తెలుస్తోంది.

మెయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో చర్చలు జరుపుతుండగా పోలీసులు రైడ్ చేశారు. భారీగా నగదుతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఇదే స్పాట్ లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు వార్తలు బయటికి వస్తున్నాయి. దీని వెనక ఓ జాతీయ పార్టీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Wed, 26 Oct 202201:09 PM IST

స్పెషల్ ట్రైన్స్…. 

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్ద నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి, సికింద్రాబాద్, కాచిగూడ, యశ్వంతపూర్, పూరి, సంత్రగాచి, నాందేడ్, విశాఖపట్నానికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

Wed, 26 Oct 202212:12 PM IST

పీడీ యాక్ట్ పై కీలక తీర్పు.. 

ఎమ్మెల్యే రాజాసింగ్ కు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదైన పీడీయాక్ట్ పై అడ్వైజరీ బోర్డు కీలక తీర్పునిచ్చింది. రాజిసింగ్ పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను కమిటీ సమర్ధించింది. పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది.

Wed, 26 Oct 202211:28 AM IST

సీఎం సమీక్ష….

టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలన్నారు ఏపీ సీఎం జగన్. పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా మారే ప్రమాదం ఉందన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గృహా నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు గృహనిర్మాణంలో పురోగతిని సీఎంకు వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గితే పనుల్లో మరింత వేగం పెరగనుంది. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Wed, 26 Oct 202210:51 AM IST

రాపోలు రాజీనామా

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన రాపోలు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. 

Wed, 26 Oct 202210:48 AM IST

40 కోతులు మృతి… 

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం గ్రామ పరిధిలో విషాద దృశ్యం కనిపించింది. అక్టోబర్ 25వ తేదీన 40 కోతుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. రోడ్డు పక్కన తోటలో అపస్మారక స్థితిలో మరికొన్ని కోతులు కనిపించాయి. కోతులపై విష ప్రయోగం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ అటవీ శాఖ అధికారి మురళీ కృష్ణ ఈ ఘటన స్పందించారు. ఎవరో కోతులను ట్రాక్టర్‌లో తీసుకొచ్చి గ్రామ అటవీ ప్రాంతంలో వదిలేశారని చెప్పారు. ఈ ఘటనలో దాదాపు 40 నుంచి 45 కోతులు చనిపోయాయని చెప్పారు. ఈ కోతులకు పోస్టుమార్టం నిర్వహించామని... 5 రోజుల్లో నివేదికలు వస్తాయని వెల్లడించారు. ఎనిమిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Wed, 26 Oct 202209:15 AM IST

రేపట్నుంచి రాహుల్ యాత్ర….. 

రేపు ఉదయం మక్తల్ సబ్ స్టేషన్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నేరుగా రాహుల్ గాంధీ మక్తల్‌కు వెళ్లనున్నారు.

Wed, 26 Oct 202208:26 AM IST

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్​కు లేదని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు జగన్ పక్కదారి పట్టిస్తున్నారి ఆరోపించారు.

Wed, 26 Oct 202208:26 AM IST

వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారు

వ్యవసాయ మీటర్ల కొనుగోళ్లలో జగన్​ వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. తనకు రావాల్సిన వాటా కోసం జగన్ అతృతగా ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు వివిధ రూపాల్లో వందల ఎకరాల భూమి కట్టబెట్టారన్నారు. వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ బకాయిలు పెట్టిన ప్రభుత్వం, మీటర్ల సబ్సిడీ నగదు ఎలా సకాలంలో చెల్లిస్తుందని అడిగారు.

Wed, 26 Oct 202204:50 AM IST

న‌వంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా న‌వంబ‌రు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు. అక్టోబ‌రు 26వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల టోకెన్లను విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

Wed, 26 Oct 202204:48 AM IST

నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ

నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోదీ రానున్నారు. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మరిన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Wed, 26 Oct 202204:31 AM IST

అమెరికాలో రోడ్డుప్రమాదం.. నలుగురు తెలుగువారు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు తెలుగువాళ్లు మృతి చెందారు. మినీవ్యాను, ట్రక్కు ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ సమయంలో వ్యానులో ఏడుగురు ప్రయాణిస్తు్న్నారు.

Wed, 26 Oct 202203:36 AM IST

27న నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన

సీఎం జగన్‌ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరుతారు. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

Wed, 26 Oct 202203:30 AM IST

సదర్ వేడుకల్లో రూ.35 కోట్ల దున్నరాజు

సదర్ వేడుకలు హైదరాబాద్ లో సందడిగా సాగుతున్నాయి. వేడుకల కోసం హర్యానా నుంచి దున్నరాజులను నిర్వాహకులు తీసుకొచ్చారు. దీపావళి అనంతరం యాదవులు నిర్వహించే ఈ ఉత్సవాల్లో రూ.35 కోట్ల గరుడ మేలు జాతి దున్నరాజును తీసుకొచ్చారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.