తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila: షర్మిలతో జగన్ సంబంధం కలుపుకుంటున్నారా..?

YS Sharmila: షర్మిలతో జగన్ సంబంధం కలుపుకుంటున్నారా..?

06 November 2023, 15:44 IST

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నైతికంగా వైఎస్ఆర్టీపీ మద్దతు తెలపటంపై వ్యాఖ్యలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. గతంలో వైఎస్ షర్మిలతో సంబంధం లేదని మాట్లాడిన ఈ నాయకులే ఈ రోజు తమ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. సంబంధం కలుపుకునేందుకే ఈ మాటల మాట్లాడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. ముందు సజ్జల ఏపీ కథ గురించి చూసుకోవాలని షర్మిల సూచించారు. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.