తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyd Liberation Day : విమోచన దినోత్సవం చేసేందుకు భయపడ్డారు - అమిత్ షా

Hyd Liberation Day : విమోచన దినోత్సవం చేసేందుకు భయపడ్డారు - అమిత్ షా

17 September 2022, 18:24 IST

  • amith sha in hyderabad liberation day event:హైదరాబాద్ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అమరవీరులకు అమిత్‌షా నివాళులర్పించారు. ఆ తర్వాత సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషితోనే నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ పటేల్‌ ముగింపు పలికారని చెప్పుకొచ్చారు. గడిచిన ఇన్ని సంవత్సరాల్లో  విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన అకృత్యాల డ్యాక్యుమెంటరీని దేశం నలుమూలలా ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పాల్గొన్నారు. వీడియోని చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..