తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Ktr | నిరుద్యోగులతో కేటీఆర్ చిట్ చాట్ .. ఎవరిపైనా దయ లేదన్న మంత్రి

Minister KTR | నిరుద్యోగులతో కేటీఆర్ చిట్ చాట్ .. ఎవరిపైనా దయ లేదన్న మంత్రి

22 November 2023, 12:45 IST

  • TSPSCలో పేపర్ లీకేజీ అంశంపై నిరుద్యోగుల వద్ద తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. పేపర్ లీకేజీ తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి నిరుద్యోగులతో విస్తృతంగా సంభాషించి కేటీఆర్.. వారిపై హామీల వర్షం కురిపించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో తాను ప్రత్యేకంగా సమావేశం అవుతానని అన్నారు. వారి సమస్యల గురించి చర్చిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ స్వార్ధ రాజకీయాలు చేస్తుందనీ, ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు దాదాపు 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వివరించారు. ఇచ్చినా హామీకి రెట్టింపుగానే 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు.