తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Rains: నగరంలో భారీ వర్షం.. అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని ఆదేశాలు

Hyderabad Rains: నగరంలో భారీ వర్షం.. అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని ఆదేశాలు

05 September 2023, 11:38 IST

  • హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటికి నగర వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్‌ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్ తోపాటు, పలు జిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.