తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy: అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్.. అసదుద్దీన్ చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్

Revanth Reddy: అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్.. అసదుద్దీన్ చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్

06 October 2023, 16:41 IST

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పదేళ్ల పాలన.. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇస్తే, లక్షల కోట్ల అప్పులు చేసి మిగిల్చారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు దోచుకున్నది చాలదన... కొత్తగా మేనిఫెస్టోలో చెప్పడానికి ఏముందని ప్రశ్నించారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ కలిసే ఉన్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీ మధ్య అవగాహన కుదిరిందన్నారు రేవంత్ రెడ్డి. అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.