తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Akbaruddin Owaisi | పోలీసు ఇన్‌స్పెక్టర్‌కి అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరింపులు

Akbaruddin Owaisi | పోలీసు ఇన్‌స్పెక్టర్‌కి అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరింపులు

22 November 2023, 11:59 IST

  • ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార ప్రసంగాన్ని ముగించాలని సూచించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి ఇంకా ఎవరూ పుట్ట లేదని పోలీసులతో అన్నారు. సమయ స్పూర్తితో పోలీసులు చెబుతున్నప్పటికీ.. అక్బరుద్దీన్ పట్టించుకోలేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్, మరోసారి రాష్ట్ర పోలీసులపై నోరు పారేసుకున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంపై ఇంకా పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు.