తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana Congress: అసెంబ్లీలో ఎదురుపడ్డ రేవంత్, జగ్గారెడ్డి.. సరదా సంభాషణ వైరల్

Telangana Congress: అసెంబ్లీలో ఎదురుపడ్డ రేవంత్, జగ్గారెడ్డి.. సరదా సంభాషణ వైరల్

02 December 2022, 18:55 IST

  • Revanth reddy Jaggareddy Interesting Conversation: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.తమది తోటికోడళ్ల మధ్య పంచాయితీ మాత్రమేనని రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన వీరు.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తాను రేవంత్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నది చెప్పేశానని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడబోనన్నారు. ముందు ఒకటి, వెనుక ఒకటి తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాము అనుకుంటాం, ఆ తర్వాత కలిసుంటామంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తోటికోడళ్లు అనుకుంటారు.. ఆ తర్వాత కలిసుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నవ్వుతూ చెప్పారు. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.