తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: అదిరిపోయిన పీవీ సింధు డ్యాన్స్‌.. ఓ రేంజ్‌లో స్టెప్పులు!

Viral video: అదిరిపోయిన పీవీ సింధు డ్యాన్స్‌.. ఓ రేంజ్‌లో స్టెప్పులు!

04 July 2022, 21:38 IST

స్టార్ షట్లర్ పీవీ సింధూ డాన్స్ సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. ప్రస్తుతం మలేషియాలో ఉన్న సింధు అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. మలేషియాలోని టారిస్ట్ ప్లేస్‌లో విహరిస్తోంది. తాజాగా 'హెడ్ షోల్డర్ నీస్' 'గోమి గోమి' రీమిక్స్ పాటలపై ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసింది. బ్లాక్ ప్యాంటు , కూల్ సన్ గ్లాస్ ధరించి సింధు తన డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. 'మీకు ఏది నిజంగా సంతోషాన్ని కలిగిస్తుందో, అది చేయండి' అనే క్యాప్షన్‌తో వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. నెటిజన్లు ఆమె డ్యాన్స్ స్కిల్స్‌ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు,