తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nia Raids : ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్‌ దోస్తీపై ఎన్‌ఐఏ ఫోకస్.. 51 చోట్ల రైడ్స్

NIA Raids : ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్‌ దోస్తీపై ఎన్‌ఐఏ ఫోకస్.. 51 చోట్ల రైడ్స్

27 September 2023, 12:58 IST

  • కెనడా కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు వారికి అండగా నిలుస్తున్న సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే ఇవాళ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ సహా 51 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. ఖలిస్థానీ తీవ్రవాదులతో సంబంధం ఉన్న హవాలా ఆపరేటర్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్‌లను అరెస్టు చేసే లక్ష్యంతో సోదాలు చేశారు. పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13 చోట్ల, హర్యానాలో 4 చోట్ల, ఉత్తరాఖండ్‌లో 2 చోట్ల, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో చోట సోదాలు నిర్వహించారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్లను విచారించగా.. ఈ కీలక సమాచారం తెలిసింది. దీని ఆధారంగా ఎన్ఐఏ ఈ దాడులు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.