తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-hamas War | గాజా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు.. పారిపోతున్న ప్రజలు

Israel-hamas War | గాజా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు.. పారిపోతున్న ప్రజలు

17 October 2023, 9:39 IST

  • ఇజ్రాయెల్-హమాస్ గ్రూప్ మధ్య 10 రోజులు యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపులా భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని ప్రజలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాల సరిహద్దులకు వెళ్తున్నారు. మరోవైపు గాజా ప్రాంతాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. హమాస్ గ్రూప్ లక్ష్యంగా ఇది వరకు వాయు మార్గం ద్వారా పోరాటం చేసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ కు తమ మద్దతును ప్రకటిస్తూనే ఉంది అగ్రరాజ్యం అమెరికా. US అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మాట్లాడుతూ.. హమాస్ ను పిరికివాళ్ల సమూహంగా అభివర్ణించారు. ప్రజల వెనుక దాక్కొని దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కు సూచన చేశారు. అమాయకపు ప్రజలపై దాడుల వద్దని ఇజ్రాయెల్ కు చెప్పారు.మరోవైపు యుద్ధం తామే పూర్తి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు.