తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Taliban's 'Cruelest' Commander Died | క్రూర క‌మాండ‌ర్ మృతి

Taliban's 'cruelest' commander died | క్రూర క‌మాండ‌ర్ మృతి

26 July 2022, 21:45 IST

Taliban's 'cruelest' commander : అఫ్గానిస్తాన్‌లో తాలిబ‌న్ కు భారీ దెబ్బ‌. తాలిబ‌న్ కీల‌క మిల‌ట‌రీ క‌మాండ‌ర్ల‌లో ఒక‌రైన పీర్ ఆఘా చ‌నిపోయాడు. హ‌జ్ నుంచి తిరిగి వ‌చ్చిన త‌రువాత ఒక కారు ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందాడు. తాలిబ‌న్‌లో అత్యంత క్రూరుడైన క‌మాండ‌ర్‌గా పీర్ అఘాకు పేరుంది. తాలిబ‌న్ వ్య‌తిరేకుల‌ను చిత్ర హింస‌లు పెట్టి చంపేస్తుంటాడ‌ని, తాలిబ‌న్ అగ్ర నాయ‌క‌త్వం కూడా ఆఘా అంటే భ‌య‌ప‌డుతుంద‌ని యూఎస్ మీడియా క‌థనం. ఆఘా మృతి ప‌ట్ల హ‌క్కానీ గ్రూప్, తాలిబ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాయి. అఫ్గాన్‌లో అమెరికా ద‌ళాల‌ను స‌మ‌ర్దంగా ఎదుర్కొన్నార‌ని, నాన్‌గ‌రార్ ప్రావిన్స్‌లో ఐసిస్ ను అంతం చేశాడ‌ని కొనియాడాయి. కాంద‌హార్ ప్రావిన్స్ లో జ‌రిగిన‌ పీర్ అఘా అంత్య‌క్రియ‌ల‌కు తాలిబ‌న్ అగ్ర నాయ‌క‌త్వం స‌హా పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. పూర్తి వివ‌రాలు ఈ వీడియోలో చూడండి..