తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Navy Death Penalty | గూఢచర్యం ఆరోపణలపై.. ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు

Indian Navy Death Penalty | గూఢచర్యం ఆరోపణలపై.. ఖతార్‌ కోర్టు సంచలన తీర్పు

27 October 2023, 11:43 IST

  • భారత్ కు చెందిన 8 మంది మాజీ నౌకాదళ అధికారులు కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్నారు. వీరు గూఢచర్యం అరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా 8 మంది నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ సంస్థ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న వీరంతా.. ఇజ్రాయెల్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ఖతార్‌ అధికారులు వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరికి మరణశిక్ష విధిస్తూ ‘కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ఆఫ్‌ ఖతార్‌’ గురువారం తీర్పు వెలువరించింది. దీనిపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది