తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mamata Banerjee | బీజేపీని వాషింగ్ మెషిన్ తో పోల్చిన పశ్చిమ బంగాల్ సీఎం

Mamata banerjee | బీజేపీని వాషింగ్ మెషిన్ తో పోల్చిన పశ్చిమ బంగాల్ సీఎం

30 March 2023, 13:17 IST

పశ్చిమ బంగాల్ లోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వాషింగ్ పౌడర్‌ పేరుతో వీడియోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వీటికి భిన్నమైన ప్రచారానికి మమత బెనర్జీ పూనుకున్నారు. బీజేపీ పేరుతో ఓ వాషింగ్‌ మెషిన్‌ను ఓ సభలో ప్రదర్శించారు మమతా. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు, అదే వ్యక్తులు బీజేపీలో కలిస్తే పునీతులు అవుతారని మమత ఎద్దేవా చేశారు.వాషింగ్ మెషిన్ లోని బట్టలు వేసి ఈ ప్రక్రియను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.