తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Milan-2024 | విశాఖ సాగర తీరంలో ఘనంగా మిలన్ 2024 వేడుకలు

MILAN-2024 | విశాఖ సాగర తీరంలో ఘనంగా మిలన్ 2024 వేడుకలు

20 February 2024, 10:10 IST

  • తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖలో ‘మిలాన్‌- 2024’ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్ర పోలీసులతోపాటు నౌకదళం కవాతు ఆకట్టుకుంది. సముద్రంలో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ప్రమాదాల్లో చిక్కుక్కున్న వ్యక్తులను ఏ విధంగా రక్షిస్తారనే విషయాలను కళ్లకు కట్టినట్టుగా నౌకదళం చూపించింది. తక్కువ ఎత్తులో హెలికాప్టర్ల చక్కర్లు కొట్టడంతో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేశారు. ఇక ఈ నెల 27వ తేదీ వరకూ రెండు దశల్లో జరిగే ఈ వేడుకలో 50 దేశాలకు చెందిన నౌకాదళ సిబ్బంది, వారి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు పాల్గొంటున్నాయి.