తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India Votes For Ukraine At Un: ఐరాసలో రష్యాకు షాకిచ్చిన భారత్

India votes for Ukraine at UN: ఐరాసలో రష్యాకు షాకిచ్చిన భారత్

17 September 2022, 18:54 IST

India votes for Ukraine at UN: భారత్ అంతర్జాతీయ వేదికపై మరోసారి రష్యాకు వ్యతిరేకంగా గళం విప్పింది. ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం జరిగిన ఒక ఓటింగ్ లో ఉక్రెయిన్ వాదనను సమర్దిస్తూ ఓటేసింది. రష్యా ఆక్రమణపై తన వాదన వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఐరాసను కోరారు. జనరల్ అసెంబ్లీలో తన ప్రి రికార్డెడ్ స్పీచ్ ను వినిపించడానికి అనుమతినివ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో ఉక్రెయిన్ కు మద్దతుగా భారత్ ఓటేసింది. ఈ ప్రతిపాదనను రష్యా సహా ఏడు దేశాలు వ్యతిరేకించగా, భారత్ సహా 101 దేశాలు సపోర్ట్ చేశాయి. ఆగస్ట్ లో కూడా ఐరాస భద్రత మండలి లో ఉక్రెయిన్ కు మద్దతుగా భారత్ ఓటేసి, మిత్రదేశం రష్యాకు షాకిచ్చింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..