తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ganesh Utsav At Idgah Row: ఈద్గా మైదాన్‌లో గ‌ణేశ్ ఉత్స‌వాలు

Ganesh Utsav At Idgah Row: ఈద్గా మైదాన్‌లో గ‌ణేశ్ ఉత్స‌వాలు

31 August 2022, 17:56 IST

Ganesh Utsav At Idgah Row: బెంగ‌ళూరులోని చ‌రిత్రాత్మ‌క ఈద్గా మైదాన్‌లో బుధ‌వారం గ‌ణేశ్ ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య క‌ర్నాట‌క హైకోర్టు మంగ‌ళ‌వారం రాత్రి ఈద్గా మైదాన్‌లో గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. దాంతో, నిర్వాహ‌కులు బుధ‌వారం ఉద‌యం అక్క‌డ గ‌ణేశ్ విగ్ర‌హం నిలిపి, తొలి పూజ‌లు జ‌రిపారు. కోర్టు ఆదేశాల మేర‌కు మూడు రోజుల పాటు ఉత్స‌వాలు జ‌రుపుతామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. అంత‌కుముందు, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఈద్గా మైదాన్‌లో గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను అనుమ‌తించ‌ కూడ‌ద‌న్న పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈద్గా మైదాన్‌లో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని విచార‌ణ అనంత‌రం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, త‌ద‌నంత‌ర విచార‌ణ‌కు హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని సూచించింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..