తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Airport | దొంగ బంగారం ఇలా కూడా తేవచ్చా..?.. ఈ ఐడియాతోనూ అడ్డంగా బుక్

Delhi Airport | దొంగ బంగారం ఇలా కూడా తేవచ్చా..?.. ఈ ఐడియాతోనూ అడ్డంగా బుక్

21 November 2023, 14:40 IST

  • విదేశాల నుంచి వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా భారతదేశానికి తరలించాలని కొందరు చూస్తుంటారు. అయితే విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులకు మాత్రం ఇట్టే దొరికిపోతుంటారు. ఎంత పకడ్బందీగా తెచ్చినా, చివరి అధికారుల చెంత చిక్కిపోతుంటారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు.. బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయుడి నుంచి 4 కిలోల బంగారాన్ని పట్టేశారు. బంగారాన్ని జ్యూస్ టెట్రా ప్యాకెట్ లో తెచ్చాడు. అయినా కస్టమ్స్ తనిఖీల్లో చిక్కాడు. దీని విలువ 2.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు