తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | ప్యాంట్ నడుం భాగం చుట్టూ గోల్డ్ బిస్కెట్లు.. వీడియో వైరల్

Viral Video | ప్యాంట్ నడుం భాగం చుట్టూ గోల్డ్ బిస్కెట్లు.. వీడియో వైరల్

13 November 2023, 11:20 IST

  • తిరుచ్చి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతి వద్ద నుంచే మరో 94 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణికుడు తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 47 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తి బంగారం ఎరికీ కనిపించకుండా తరలించే ప్రయత్నం చేశాడు. ప్యాంట్ నడుం భాగంలో బెల్టు పెట్టుకొనే ప్రదేశంలో చుట్టూరా గోల్డ్ బిస్కెట్ల ను పెట్టి స్టిచ్చింగ్ చేశాడు. ఆ ప్యాంట్ ను పరిశీలించి, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.