తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'Buying Underwear': ‘అవును.. అండర్ వేర్ కొనుక్కోవడానికి వెళ్లాను’

'Buying underwear': ‘అవును.. అండర్ వేర్ కొనుక్కోవడానికి వెళ్లాను’

08 September 2022, 18:46 IST

‘‘అవును.. అండర్ వేర్ కొనడానికి వెళ్లాను’’

జార్ఖండ్ రాజకీయ సంక్షోభం సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన దుమ్కా ఎమ్మెల్యే, సీఎం హేమంత్ సొరేన్ సోదరుడు బసంత్ సొరేన్ వింత సమాధానం ఇది. జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీజేపీ చేస్తోందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమ ఎమ్మెల్యేలను సొరేన్ ప్రభుత్వం రిసార్ట్ ల్లో దాచేసింది. అప్పుడు, ఎవరికీ అందుబాటులో లేకుండా, బసంత్ సొరేన్ ఢిల్లీ వెళ్లాడు. బీజేపీ నేతలతో సంప్రదింపులకే ఆయన ఢిల్లీ వెళ్లాడన్న వార్తలు గుప్పుమన్నాయి. సమస్య సద్దుమణిగిన తరువాత, హేమంత్ సర్కారుకు గండం తప్పిన తరువాత.. తాపీగా మీడియాతో మాట్లాడుతూ పై వివరణ ఇచ్చారు బసంత్ సోరెన్. 

`అవును. అప్పుడు ఢిల్లీ వెళ్లాను. అండర్ వేర్ లు కొనుక్కోవడం కోసం ఢిల్లీ వెళ్లాను` అని మీడియా ప్రశ్నకు తాపీగా, తల గోక్కుంటూ, నిస్సిగ్గుగా జవాబిచ్చాడాయన. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..