తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: ఆ దేశంలోనూ 'బుల్డోజర్' చర్యలు .. బైకులన్నీ నుజ్జు నుజ్జు

Viral Video: ఆ దేశంలోనూ 'బుల్డోజర్' చర్యలు .. బైకులన్నీ నుజ్జు నుజ్జు

26 June 2022, 8:22 IST

Bulldozer destroys hundreds of illegal Bikes: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రద్దీ రోడ్లపై బైక్ రాయుళ్లు చేసే 'డర్ట్ బైక్ రేసింగ్' కారణంగా అమెరికాలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై దృష్టిపెట్టిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్... కఠిన చర్యలకే దిగారు. రిజిస్ట్రేషన్ లేని బైక్‌లన్నింటినీ ఓ మైదానంలోకి చేర్చి వాటి మీదకి బుల్డోజర్ ఎక్కించారు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు 100లోపు ఉన్న బైకులన్నీ ధ్వంసం అయ్యాయి. రోడ్లను సురక్షితంగా మార్చేందుకే ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు ఆడమ్స్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధ్వంసం చేయడం కంటే మరోలా చర్యలు తీసుకొని ఉంటే బెటర్ గా ఉండేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం  వీడియోను వీక్షించండి….