తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ganesh Temple Row | క్యాంపస్ లో ఆలయ నిర్మాణం; బెంగళూరు వర్సిటీలో ఉద్రిక్తత

Ganesh temple row | క్యాంపస్ లో ఆలయ నిర్మాణం; బెంగళూరు వర్సిటీలో ఉద్రిక్తత

09 September 2022, 22:02 IST

Ganesh temple row | క్యాంపస్ లో వినాయకుడి ఆలయాన్ని నిర్మించాలన్న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలను బెంగళూరు లోని `బెంగళూరు యూనివర్సిటీ` విద్యార్థులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ ఫాకల్టీతో కలిసి ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విశ్వ విద్యాలయాన్ని కాషాయీకరణ చేయాలన్న కుట్రలో భాగంగానే ఆలయ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. యూజీసీ చట్టం ప్రకారం యూనివర్సిటీ ప్రాంగణాల్లో మతపరమైన నిర్మాణాలు చేపట్టకూడదని గుర్తు చేశారు. గణేశ్ ఆలయం బదులుగా అక్కడ లైబ్రరీని నిర్మించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..