తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India-pak Love Story | సరిహద్దులు దాటించిన మరో ప్రేమ.. భారత్ వచ్చిన యువతి

India-Pak Love Story | సరిహద్దులు దాటించిన మరో ప్రేమ.. భారత్ వచ్చిన యువతి

06 December 2023, 12:58 IST

  • పశ్చిమబెంగాల్‌కు చెందిన సమీర్‌ఖాన్‌ అనే యువకుడు కోసం పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి చెందిన జవేరియా ఖానుమ్‌ భారత్ వచ్చింది. భారత్-పాక్ అధికారులతో అన్నీ అనుమతులు తీసుకొని సరిహద్దు దాడి ఇండియాలో అడుగు పెట్టింది. జవేరియా ఖానుమ్‌కు 45 రోజుల గడువుతో భారత్‌ వీసా లభించింది. పాక్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన జవేరియాను సమీర్‌ఖాన్‌ కోల్‌కతాకు తీసుకొచ్చాడు.సమీర్‌ కుటుంబసభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.జనవరిలో ఆ ఇద్దరు ప్రేమికులు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.