తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral: అమ్మ ప్రేమకు అడ్డేది... కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడిన తల్లి

Viral: అమ్మ ప్రేమకు అడ్డేది... కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడిన తల్లి

26 June 2022, 11:55 IST

సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏమీ ఉండదు..! కష్టమా.. నష్టమా అన్నది కాదు బిడ్డ ఆపదలో ఉందంటే... ఏ తల్లైనా తల్లిడిల్లిపోతుంది. ఇది మానవవాళికే కాదు అన్నీ జీవులకు వర్తిస్తోంది. ఇందుకు ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఓ పిల్ల ఏనుగును కాపాడేందుకే తల్లి ఏనుగు పెద్ద సాహసమే చేసింది. వాగులో కొట్టుకుపోతున్న గున్న ఏనుగును  ముందుకు వెళ్లి మరీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తల్లి ఏనుగు సాహసంపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోను వీక్షించండి.....