తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Period Trackers | మహిళల రుతుచక్రాన్ని ట్రాక్ చేసే యాప్‌లు ఎంతవరకు సురక్షితం?

Period Trackers | మహిళల రుతుచక్రాన్ని ట్రాక్ చేసే యాప్‌లు ఎంతవరకు సురక్షితం?

18 July 2022, 14:22 IST

  • ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. మన ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించి కూడా ఎన్నో రకాల గాడ్జెట్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మన హార్ట్ బీట్ రేట్, హీమో గ్లోబిన్ పర్సంటేజ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆఖరుకు మహిళల ఆరోగ్యానికి సంబంధించి రుతుక్రమ చక్రాన్ని కూడా ట్రాక్ చేస్తాయి. కానీ ఈ పద్ధతి ఎంత వరకు సురక్షితం? ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, సున్నితమైన సమాచారాన్ని సేకరించటం వారి భద్రను భంగపరచటం కిందకే వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మిలియన్ల మంది తమ రుతుచక్రాన్ని యాప్‌లలో ట్రాక్ చేస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారికి బ్లీడింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది, తలనొప్పి ఎప్పుడు వస్తుంది, మూడ్ ఎలా మారుతుంది, గర్భంకోసం ప్రయత్నిస్తున్నారా? ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు, కోరికలు వారికి ఉన్నాయి వంటి సున్నితమైన వ్యక్తిగత సేకరిస్తూ వారి డేటా క్లౌడ్ లో భద్రపరుచుకుంటున్నాయి. వీరి డేటాను ఇతర హెల్త్ కేర్ సెంటర్లకు, మెడిసిన్ అందజేసే వారికి నిశబ్దంగా చేరవేస్తూ యూజర్లను వారితో కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవవచ్చో ఈ వీడియో చూడండి.