తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Museum Of The Future | కలల ప్రపంచంలోకి ప్రయాణం.. ఈ మ్యూజియం భూలోక అద్భుతం!

Museum of the Future | కలల ప్రపంచంలోకి ప్రయాణం.. ఈ మ్యూజియం భూలోక అద్భుతం!

05 May 2022, 13:33 IST

  • మనలో చాలా మంది మ్యూజియం సందర్శించి ఉంటారు. కానీ భవిష్యత్తులోకి తీసుకెళ్లే మ్యూజియంను చూశారా? దుబాయ్‌లోని 'మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్' ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కిల్లా డిజైన్ కాలిగ్రఫీతో ఎలాంటి స్తంభాలు లేకుండానే టోరస్ ఆకారంలో ఏడు అంతస్తుల భవనంగా ఈ మ్యూజియం నిర్మితమైంది. ఇప్పుడు ఇది దుబాయ్‌కి మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో దుబాయ్ నగరాన్ని విహంగ వీక్షణం చేయవచ్చు, సౌర కుటుంబం- భూమి, ఇతర గ్రహాల పరిభ్రమనాన్ని వీక్షించవచ్చు. అడవిలో వర్షాన్ని ఆస్వాదించవచ్చు. రేపటి తరం ఎలా ఉంటుందో ఆ ఊహాలోకాన్ని కళ్లారా చూడవచ్చు. అందుకే దీనిని భవిష్యత్తు మ్యూజియం అంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే తెలుగులో 'ఆదిత్య 369' సినిమాని లైవ్ గా చూడవచ్చు. ఈ వీడియో ఒకసారి చూడండి..