తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Protein Bars | ప్రోటీన్ బార్‌లలో ఏముంటుంది? వీటిని తినడం మంచిదేనా?

Protein Bars | ప్రోటీన్ బార్‌లలో ఏముంటుంది? వీటిని తినడం మంచిదేనా?

30 June 2022, 22:39 IST

  • ప్రోటీన్ బార్‌లు అనేవి పోషకాహార బార్‌లు. ఇందులో కార్బోహైడ్రేట్‌లు, కొవ్వుల కంటే కూడా ప్రోటీన్‌లను అధిక నిష్పత్తిలో కలిగి ఉంటాయి. వీటిని జిమ్ చేసేవారు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, అథ్లెటిక్స్ ఎక్కువగా తింటుంటారు. ఒక సాధారణ ప్రోటీన్ బార్‌లో 28 శాతం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంటే ఒక గ్రాముల ప్రోటీన్ బార్‌ తీసుకుంటే దాని నుంచి 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మరి ఎందుకు ప్రోటీన్ బార్లనే ఎంచుకోవాలి వేరే వాటిలో ప్రోటీన్ లభించదా అంటే మిగతా పదార్థాలలో తక్కువ ప్రోటీన్ లభిస్తుంది. ఉదాహరణకు పాలలో 3.5 శాతం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. మిగతా 87 శాతం నీరు ఉంటుంది. బటానీలలో 22 శాతం అయితే తియ్యగా, ఫ్లేవర్లతో కూడిన ప్రోటీన్ బార్లలో ప్రోటీన్ శాతం తగ్గిపోతుంది. ఇంకా అధికంగా ప్రోటీన్ కావాలంటే Whey ప్రోటీన్ తీసుకోవాలి. దీని గురించి మరింత సమాచారాన్ని ఆహార పదార్థాల నిపుణులు, రచయిత, పరిశోధకురాలు శ్వేత శివకుమార్ వెల్లడించారు. ఈ వీడియోలో తెలుసుకోండి..