తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jeep Meridian | జీప్ మెరిడియన్ Suv అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

Jeep Meridian | జీప్ మెరిడియన్ SUV అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

01 May 2022, 11:04 IST

ఆటోమొబైల్ తయారీదారు జీప్ తమ బ్రాండ్ నుంచి మూడు సీట్ల వరుసల జీప్ మెరిడియన్ SUVని త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. బుకింగ్‌లను మే మొదటి వారం నుంచే ప్రారంభించనున్నట్లు జీప్ ప్రకటించింది. జూన్ మూడవ వారం నుంచి డెలివరీలు జరుగుతాయి. ఫోర్డ్ ఎండీవర్ మిగిల్చిన శూన్యతను మెరిడియన్ వాహనంతో భర్తీ చేయాలని జీప్ సంస్థ భావిస్తోంది. అయితే ఈ ఎస్‌యూవీని డీజిల్ కారుగా మాత్రమే విడుదల చేయనున్నారు. మరి కఠినమైన ఆఫ్-రోడ్ దారుల్లో ఈ మెరిడియన్ వాహనం సామర్థ్యం చూపగలదా? HT ఆటోమొబైల్ సమాచార విభాగం చేపట్టిన ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూడండి..