తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bmw I4 | క్రాష్ టెస్టులో నిరాశపరిచిన ఖరీదైన కార్.. రేటింగ్స్ తగ్గాయి!

BMW i4 | క్రాష్ టెస్టులో నిరాశపరిచిన ఖరీదైన కార్.. రేటింగ్స్ తగ్గాయి!

07 July 2022, 14:26 IST

కొత్తగా విడుదలైన BMW ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ i4, ఇటీవల నిర్వహించిన యూరో NCAP క్రాష్ పరీక్షలలో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది మెరుగైన రేటింగ్ అయినప్పటికీ.. ప్రతీ అంశంలోనూ ఎంతో ఖరీదైన ఈ కార్ పూర్తి 5 స్టార్ రేటింగ్‌ను సులభంగా పొంది ఉండాల్సింది. గత ఏడాది యూరో ఎన్‌సిఎపిలో BMW 4 సిరీస్ కూపే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. కానీ ఈ ఏడాది BMW 4 సిరీస్‌లో i4 కార్ రేటింగ్స్ తగ్గటం కంపెనీకి ఒక రకమైన షాక్ లాంటిదే అని చెప్పవచ్చు. ఈ కారులో వివిధ స్థానాల్లో కూర్చునే అందరు ప్రయాణికులకు ఒకే విధమైన రక్షణ ఉంటుందని BMW తెలిపింది. కానీ, పరీక్ష సమయంలో ఇంపాక్ట్ ట్రాలీలో క్షీణత కనిపించింది. i4 ఫ్రంటల్ తాకిడిలో రక్షణ మధ్యస్తంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ కార్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 86 లక్షలుగా ఉంది. BMW i4 క్రాష్ టెస్టుకు సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో చూడవచ్చు.