తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Justin Trudeau: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లో సంబంధం

Justin Trudeau: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లో సంబంధం

19 September 2023, 15:25 IST

  • ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి భారత్ కు సంబంధం ఉందని కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ లో తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వ ఏజెంట్లతో హర్దీప్ సింగ్ సిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్లు ముడిపెట్టారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి విశ్వసనీయమైన సమచారం ఉందని తెలిపారు. తమ ఆందోళనను భారత భద్రత, ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేశామని ట్రూడో చెప్పారు. ఈ నెలలో జీ-20 కోసం భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై చర్చించినట్లు ఆయన గుర్తు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఆ దేశ దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించింది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.