తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamil Nadu Rains | తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన కాలనీలు

Tamil Nadu Rains | తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన కాలనీలు

18 December 2023, 11:07 IST

  • తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం తమిళ సర్కారు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం తమిళనాడు, కేరళలో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. లక్షద్వీప్‌లలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.