తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bollywood | తమన్నా పెళ్లికి మరిన్ని సంకేతాలు.. చేతిలో చెయ్యి వేసిన విజయ్

Bollywood | తమన్నా పెళ్లికి మరిన్ని సంకేతాలు.. చేతిలో చెయ్యి వేసిన విజయ్

21 November 2023, 12:16 IST

  • స్టార్ హీరోయిన్ తమన్నా, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఏడాది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట తరచుగా ఈవెంట్‌లు, పార్టీలలో కలిసి కనిపిస్తున్నారు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని బాలీవుడ్ సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. తమన్నాకి ఎక్కువ సినిమాలు చేతిలో లేకపోవడంతో ఆమె విజయ్‌తో కలిసి ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ బర్త్ డే పార్టీలోనూ విజయ్ తో కలిసి తమన్నా కనిపించారు. ఒకరిచేతిలో మరొకరి చేయి వేసి నడిచారు. ఒకే కారులో ఇద్దరూ కలిసి వెళ్లారు. దీన్ని బట్టి వీరిద్దరూ తర్వలోనే పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.