తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ అవుతానన్న భోలే.. మరోసారి బయటకు వెళ్లిన శివాజీ

Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ అవుతానన్న భోలే.. మరోసారి బయటకు వెళ్లిన శివాజీ

18 October 2023, 10:48 IST

  • రోజులు గడుస్తున్న కొద్ది.. బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్ గా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియ వచ్చేసరికి కంటెస్టెంట్లు ఫైర్ తో ఊగి పోతున్నారు. ఇప్పటికే సోమవారం రాత్రి ఎపిసోడ్ లో కొందరు నామినేట్ అవ్వగా.. తాజాగా వచ్చిన వీడియోలో భోలే వర్సెస్ శోభా శెట్టి, ప్రియాంక అనేలా కనిపించింది. డప్పు భోలే ఎంత కూల్ గా ఉన్నా, ప్రియాంక మరియు శోభాశెట్టి రెచ్చగొట్టారు. ఇక నామినేషన్ తర్వాత కూడా భోలే కూల్ గానే వారిద్దరికి సారీ చెప్పాడు. మెుదట సారీ తీసుకోకపోయినా, ఆ తర్వాత రాత్రి సమయంలో ఇద్దరూ కాస్త కూల్ అయ్యారు. ఇక శివాజీని మరోసారి బిగ్ బాగ్ బయటకు పిలిచారు. చేతికి గాయం కావటంతో, మరిన్ని టెస్టుల కోసం పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. యావర్ కెప్టెన్సీ బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సందీప్, గౌతమ్ తినేటప్పుడు యావర్ గురించి మాట్లాడుకున్నారు.