తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ysrcp Mp Madhav | ఏఎన్ఐ ఇంగ్లీషులో మాట్లాడిన గోరంట్ల మాధవ్.. సోషల్ మీడియాలో వైరల్

YSRCP MP Madhav | ఏఎన్ఐ ఇంగ్లీషులో మాట్లాడిన గోరంట్ల మాధవ్.. సోషల్ మీడియాలో వైరల్

14 December 2023, 11:20 IST

  • పార్లమెంటులో బుధవారం జరిగిన ఘటనతో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. విజిటర్‌ పాస్‌లపై వచ్చిన ఇద్దరు దుండగులు లోక్‌సభ గ్యాలరీ నుంచి ప్రధాన మందిరంలోకి దూకి బీభత్సం సృష్టించారు. పొగను వదులుతూ అలజడి రేపారు. ఈ ఘటనపై జాతీయ మీడియా పలువురు ఎంపీ నుంచి వివరణ తీసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏఎన్ఐతో మాట్లాడారు. రిపోర్టర్ ఇంగ్లీష్, హిందీలో ప్రశ్నలు అడగ్గా.. ఘటనను వివరించేందుకు మాధవ్ ఇబ్బంది పడ్డారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పంచులు పేలుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.