తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nara Lokesh: మూడు నెలల్లో సైకో జగన్ పిచ్చాసుపత్రికి ప్యాకప్

Nara Lokesh: మూడు నెలల్లో సైకో జగన్ పిచ్చాసుపత్రికి ప్యాకప్

27 November 2023, 15:26 IST

  • తెలుగుదేశం పార్టీ నాయకులను కేసులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మండిపడ్డారు. సైకో జగన్‌కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందన్న లోకేష్.. 3 నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే జగన్ కు ఉచ్చపడుతోందని అన్నారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత తిరిగి ప్రారంభించారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్ అడ్డుకోవడానికి స్కెచ్‌లు వేశారన్నారు. అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని స్పష్టం చేశారు.