తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyclone Michaung In Ap | ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం.. జల విలయంలో నెల్లూరు

Cyclone Michaung in AP | ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం.. జల విలయంలో నెల్లూరు

05 December 2023, 10:29 IST

  • ఆంధ్రప్రదేశ్ వైపు మిచౌంగ్‌ తుఫాన్‌ ముంచుకొస్తోంది. సోమవారం ఉదయం తీవ్ర తుఫాన్‌గా మారడంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా తయారైంది. నెల్లూరు జిల్లాలో ఈ తుఫాను సోమవారమే బీభత్సం సృష్టించింది. తిరుపతి, కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. మంగళవారం బాపట్లకు దగ్గరలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.