తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Apcc Calls For Chalo Secretariat | పార్టీ శ్రేణుల హౌస్ అరెస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం

APCC Calls for Chalo Secretariat | పార్టీ శ్రేణుల హౌస్ అరెస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం

22 February 2024, 11:04 IST

  • నిరుద్యోగుల సమస్యలపై ఇవాళ చలో సెక్రటేరియట్‌కు ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. చలో సెక్రటేరియట్ పేరిట సచివాలయ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. యువతకు అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ వైసీపీ సర్కారుకి వినతిపత్రం అందించాలని భావించాయి. ఈ క్రమంలోనే పోలీసులు మోహరించారు. విజయవాడలో ఎక్కడికక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. ఆమెను నిన్న రాత్రి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.