తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Anganwadis Protest | నువ్వు మోసగాడివయ్యా.. నువ్వు ఇంటికి పోతావయ్యా అంటూ జగన్ పై పాట

AP Anganwadis Protest | నువ్వు మోసగాడివయ్యా.. నువ్వు ఇంటికి పోతావయ్యా అంటూ జగన్ పై పాట

13 December 2023, 13:37 IST

  • ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీలో అంగన్వాడీలు రోడ్లెక్కారు. తెలంగాణాలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సీఎం.. ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. వివిధ రకాల పనుల పేరుతో తమపై వేధింపులు ఆపాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చనున్నందని హెచ్చరించారు. జగన్ తమని మోసం చేశారని పలువురు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏ విధంగా మోసం చేశాడనే దానిపై పాట కూడా పాడారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది.