తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Crops Damage In Ap | వరద నీటిలో రైతన్న పంట.. ప్రభుత్వ సాయం కోసం వేడుకోలు

Crops Damage in AP | వరద నీటిలో రైతన్న పంట.. ప్రభుత్వ సాయం కోసం వేడుకోలు

06 December 2023, 12:08 IST

  • మిచౌంగ్ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో భీకర తుఫానుతో పంటంతా నీటిపాలైంది. దీంతో అన్నదాతలు కన్నీరు ఆగటం లేదు. డిసెంబర్ 5న బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్, పెను నష్టాన్నే మిగిల్చింది. దాదాపు 7 వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ బలహీన పడినా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.