తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter 1st Year Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
 తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

TS Inter 1st Year Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

24 April 2024, 11:59 IST

 Telangana Board Inter 1st Year Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్‌ను ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ తెలుసుకోండి.

24 April 2024, 11:59 IST

TS Inter 1st year Results 2024 Live : రంగారెడ్డి జిల్లా టాప్

 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,30,413 మంది రెగ్యులర్, 48,310 మంది ఒకేషనల్ మొత్తంగా 4,78,723 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ 2,62,829 మంది విద్యార్థులు అంటే 61.06 శాతం పాస్ అయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్ లో 24,432 మంది అంటే 50.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 2,87,261 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లో పాస్ అయ్యారు. ఉత్తీర్ణత 60.01 శాతం. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి. మొత్తం 1,65,190 మంది బాలికలు పాస్ అయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 68.35 కాగా బాలురది 51.50 శాతంగా ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో 71.70 శాతంతో రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది. కామారెడ్డి చివరి స్థానంలో ఉంది. 

రంగారెడ్డి జిల్లా -71.70 శాతం 

మేడ్చల్ జిల్లా -71.58 శాతం 

ములుగు జిల్లా- 70.01 శాతం 

ఖమ్మం -63.84 శాతం 

కరీంనగర్ -63.41 శాతం

24 April 2024, 11:11 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు 

24 April 2024, 11:04 IST

TS Inter 1st year Results 2024 Live : ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల 

ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత 60.01 శాతం

24 April 2024, 11:00 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు 

24 April 2024, 10:41 IST

TS Inter 1st year Results 2024 Live : 15 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలు

 ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) నిర్వహించారు. ఈసారి ఇంటర్ పరీక్షలకు ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టగా ఏప్రిల్ 10 వతేదీన మూల్యాంకనం(Spot Valuation) పూర్తి అయ్యింది. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేశారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు.

24 April 2024, 10:29 IST

TS Inter 1st year Results 2024 Live : మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

విద్యార్థులు ముందుగా ఈ రెండు వెబ్‌సైట్‌లలో ఒకదాన్ని ఓపెన్ చేయండి– tsbie.cgg.gov.in , results.cgg.gov.in 

రిజల్ట్స్ పేజీకి వెళ్లి మీ తరగతి, స్ట్రీమ్‌ని ఎంచుకోండి. 

మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ చేయండి.

24 April 2024, 10:21 IST

TS Inter 1st year Results 2024 Live : మరికాసేపట్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

 మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇవాళ ఉదయం 11 ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు(జనరల్, ఒకేషనల్) ఒకేసారి విడుదల చేయనున్నారు.

24 April 2024, 10:08 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రెగ్యులర్, ఒకేషనల్ ఫలితాలు

24 April 2024, 9:37 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల డైరెక్ట్ లింక్స్

24 April 2024, 9:13 IST

TS Inter 1st year Results 2024 Live : మరో రెండు గంటల్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

మరో రెండు గంటల్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను https://telugu.hindustantimes.com/telangana-board-result వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

24 April 2024, 8:53 IST

TS Inter 1st year Results 2024 Live : ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు-రీకౌంటింగ్, రీవాల్యూయేషన్

 ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత...వచ్చిన మార్కులు కంటే మీకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తే... విద్యా్ర్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. IPE ఫలితాలు వెలువడిన వెంటనే బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కు ప్రతి సబ్జెక్టుకు ఫీజు చెల్లించాలి. వీటి వివరాలు ఫలితాల తర్వాత బోర్డు ప్రకటించిస్తుంది. అయితే విద్యార్థులు మార్కుల మెమోల హార్డ్ కాపీలు వచ్చే వరకు చూడండి. ఏదైనా లోపాలు ఉంటే హార్డ్ కాపీల్లో సవరిస్తారు.

24 April 2024, 8:23 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లోకి వెళ్లాలి. 

IPE ఫస్టియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్)పై క్లిక్ చేయండి. 

మీ హాల్ టికెట్ నంబర్‌ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి. 

మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ద్వారా కాపీని పొందవచ్చు.

24 April 2024, 8:23 IST

TS Inter 1st year Results 2024 Live : తెలంగాణ ఇంటర్ 1st ఇయర్ మార్కులు

24 April 2024, 8:06 IST

TS Inter 1st year Results Live : మరో 3 గంటల్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

 మరో 3 గంటల్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ అధికారిక వెబ్ సైట్ ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల మెమోలపై అధికారులు సమాచారం ఇస్తారు.

24 April 2024, 7:40 IST

TS Inter 1st year Results Live : టీఎస్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

 తెలంగాణ ఇంటర్ 1వ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 మధ్య నిర్వహించారు.

24 April 2024, 7:30 IST

TS Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ రెగ్యూలర్, ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల లింక్స్

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

 

24 April 2024, 7:17 IST

TS Inter 1st Year Results 2024 : హెచ్.టి.తెలుగులో ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Results 2024) ఫలితాలను హెచ్.టి. తెలుగులో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై విద్యార్థులు ఫలితాలను సింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ కింది మీ ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్‌ ను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.

24 April 2024, 6:34 IST

TS inter 1st year Results 2024 date and Time: టీఎస్ ఇంటర్ ఫలితాల తేదీ, సమయం

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ ఏప్రిల్ 24, 2024 ఉదయం 11 గంటలకువ వెలువడనున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈ ఫలితాలను వెలువరిస్తారు.

24 April 2024, 6:34 IST

TS inter 1st year Results 2024: ఈరోజే తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు నేటి ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్లో పరీక్షల ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి