తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 8 Telugu News Updates : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

September 8 Telugu News Updates : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

08 September 2022, 22:46 IST

  • September 08 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..

08 September 2022, 22:46 IST

కాళోజీ సేవలు గొప్పవి

నిత్యం పరుల క్షేమాన్ని పరితపించిన ప్రజాకవి కాళోజీ సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. కాళోజీ చేసిన సేవలు గొప్పవని సీఎం అన్నారు.

08 September 2022, 22:43 IST

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం

కుషాయిగూడ చర్లపల్లి జైలు సమీపంలో రోడ్డు ప్రమాదం ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని మీద కేసు నమోదు చేసీ.. లాటీ సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు స్పాట్లో చనిపోయారు. మిగతా నలుగురిని హాస్పిటల్ కి తరలించారు. అందులో ముగ్గురు స్వల్ప గాయాలతో డిశ్చార్జ్ అయ్యారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉండడంతో యశోద హాస్పిటల్ కి తరలించారు.

08 September 2022, 20:13 IST

గవర్నర్ పై కవిత ఆగ్రహం

గవర్నర్ తమిళసై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని , సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి పాలు చేయడానికి తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించే.. గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్నారు.

08 September 2022, 20:08 IST

గండి పూడ్చేందుకు అధికారుల కష్టాలు

నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పూడ్చటం కష్టంగా మారింది. గండిని పూడ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిగా నిలిచిపోలేదు. ఈ కారణంగా గండి పూడ్చటం వీలుకాలేదు. వరద ప్రవాహంతో నీటమునిగిన గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అదికారులు.

08 September 2022, 18:22 IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ చర్లపల్లి జైలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

08 September 2022, 16:36 IST

పోలీస్ స్టేషన్ అత్తారిల్లు అయిపోయింది

గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల మృతిచెందిన పాటిబండ్ల నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. అన్న క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై నారా లోకేశ్ మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను చూసి ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనకు పోలీస్​స్టేషన్​ అత్తారిల్లులా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

08 September 2022, 15:19 IST

హైదరాబాద్ వర్షాలు

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడుతుంది. నగరంలో బుధవారం నుంచి అకస్మాత్తుగా వర్షం కురవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న మూడు రోజుల్లో నగరంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి.

08 September 2022, 12:59 IST

కొత్త కేసులు ఎన్నంటే…

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,395 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 

08 September 2022, 12:55 IST

చర్యలు చేపట్టండి 

ఏపీలో లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకూ వీరి ఆగడాలు పెరిగిపోతుండటంతో అమాయ ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సర్కార్... లోన్ యాప్ ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

08 September 2022, 12:25 IST

సీఎం సమీక్ష

 తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. 

08 September 2022, 11:43 IST

పార్కింగ్ ప్రాంతాలు ఇవే….

Hyderabad Ganesh Immersion : హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ లో గణేశ్ చతుర్థి అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. చాలామంది చూపు ఇటువైపు ఉంటుంది. ఈ మేరకు గణేశ్ ఉత్సవ సమితి కూడా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నాడు సెలవు ప్రకటించారు. అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే హుస్సేన్ సాగర్ కు వచ్చే ప్రజలు... తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలనే దానిపై కూడా పోలీసులు పలు ప్రాంతాలను ఎంపిక చేశారు.ఖైరతాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు, బుద్ధ భవన్‌ వెనుకవైపు, గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్ట మైసమ్మ గుడి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కళాశాల, పబ్లిక్‌ గార్డెన్స్‌, ఐమాక్స్‌ పక్కన వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని నగర పోలీసులు తెలిపారు.

08 September 2022, 10:29 IST

గ్వాలియర్ టూర్ 

irctc tourism announced madhya pradesh tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'HERITAGE OF MADHYA PRADESH ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గ్వాలియర్, ఖజురహో, ఓర్చా వంటి ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

08 September 2022, 10:08 IST

ఉద్యోగాలు…

ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చాలా శాఖాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ భారీ సంఖ్యలో అనుమతులు ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పల్లె, బస్తీ దవాఖానాలకు కూడా 1569 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటిని ఒప్పంద ప్రతిపాదకన భర్తీ చేస్తారు.

08 September 2022, 9:06 IST

కూనంనేని సాంబశివరావు  ఎన్నిక

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్‌రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ఎన్నికపై అర్ధరాత్రి వరకూ వాడీవేడి చర్చలు నడిచాయి. ఇద్దరు నేతలూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్‌ నిర్వహించారు. కూనంనేనికి 59, పల్లా వెంకట్‌రెడ్డికి 45 ఓట్లు పోలయ్యాయి. 

08 September 2022, 9:03 IST

వర్ష సూచన…

Rains to continue in ap and telangana for five days: దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు మహారాష్ట్రలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

08 September 2022, 7:06 IST

శ్రీవారి ఆలయం మూసివేత

సూర్య గ్రహణం (అక్టోబరు 25న), చంద్ర గ్రహణం (నవంబరు 8న) కారణంగా ఆయా రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయం 12 గంటలపాటు మూసివేయనున్నారు. అక్టోబరు 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆ రోజు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సందర్భంగా ఆ రోజు అన్ని దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం భక్తులను మా త్రమే దర్శనానికి అనుమతిస్తారు. నవంబరు 8న మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం దృష్ట్యా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు.

08 September 2022, 7:04 IST

పోలీసుల అదుపులో దళ కమాండర్‌?

మావోయిస్టు పార్టీ కొత్తగూడెం జిల్లా చర్ల దళ కమాండర్‌ రజిత అలియాస్‌ మడకం కోసిని పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో నలుగురు దళ సభ్యులను తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అదుపులోకి తీసుకున్న ట్టు సమాచారం.

08 September 2022, 6:36 IST

వరసిద్ధుడి రథోత్సవం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం రథోత్సవం  వైభవంగా సాగింది. జోరు వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయక.. స్వామివారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

08 September 2022, 6:35 IST

సీపీఎస్ పై చర్చలు…

ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్​లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు.

08 September 2022, 6:33 IST

సిద్ధార్థరావుకు 5వ ర్యాంకు

నీట్‌(యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు. ఇందులో తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్‌ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు.

    ఆర్టికల్ షేర్ చేయండి