TS SSC Results 2024 live updates: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల, 91.31శాతం ఉత్తీర్ణత
30 April 2024, 13:29 IST
- TS SSC Results 2024 live updates: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో నేరుగా తెలుసుకోండి.
TS SSC 10th Results 2024 Live: మే 15వరకు రీ కౌంటింగ్ ఫీజుల చెల్లింపు గడువు
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మే 15వ తేదీ వరకు ఉంది. మే15లోగా రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
TS SSC 10th Results 2024 Live: రీకౌంటింగ్ కోసం ఎదురు చూడొద్దు…
తెలంగాణ పదో తరగతి 2024 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. విద్యార్ధులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
TS SSC 10th Results 2024 Live: సప్లమెంటరీ పరీక్షలకు ముఖ్యమైన తేదీలు ఇవే...
- విద్యార్ధులు తాము చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మే 16వ తేదీలోగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రధానోపాధ్యాయులు ట్రెజరీ ఆఫీసుల్లో లేదా ఎస్‌బిఐ బ్యాంక్ ట్రెజరీ బ్రాంచిలలో మే 17కల్లా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్లలో ముద్రించిన ఎస్‌ఆర్ జాబితాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో మే20వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు.
- జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి మే 22లోగా జాబితాలను పంపాలని సూచించారు.
TS SSC 10th Results 2024 Live: పరీక్షకు రెండు రోజుల ముందు కూడా ఫీజు చెల్లించొచ్చు.
రూ.50రుపాయల పెనాల్టీతో విద్యార్ధులు సంబందిత సబ్జెక్టు పరీక్ష జరిగే రెండు రోజుల ముందు కూడా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. పాఠశాలల నుంచి సమాచారం అందాల్సిన విద్యార్ధుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. వారి ఫలితాలను త్వరలో ప్రకటిస్తారు.
TS SSC 10th Results 2024 Live: పది ఫలితాల మెమోలపై పెన్ నంబర్
ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల మార్కుల జాబితా విద్యార్ధుల పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ముద్రించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు.
TS SSC 10th Results 2024 Live: రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉత్తీర్ణత అధికం
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు, కేజీబీవీ స్కూల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
TS SSC 10th Results 2024 Live: గత ఏడాది కంటే అధికంగా విద్యార్ధులు
ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా, మరో 11,606మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది తెలంగాణలో 4,91,82మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
TS SSC 10th Results 2024 Live: గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు
తెలంగాణ పదోతరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించినట్టు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.
TS SSC 10th Results 2024 Live: విద్యార్ధులు ఒత్తిడి చెందొద్దు…
పదో తరగతి ఫలితాలతో విద్యార్ధులు ఒత్తిడికి గురి కావొద్దని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. ఉత్తీర్ణత సాధించలేని వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. ఫలితాలతో కలత చెందొద్దని సూచించారు.
TS SSC 10th Results 2024 Live: జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
8883 మంది 10కు 10జిపిఏ సాధించినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. జూన్ 3 నుంచి 13వరకు ఉదయం 9.30 నుంచి 12.30వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి.
TS SSC 10th Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల
తెలంగాణ పదో తరగతిలో బాలురిలో 89.41శాతం, బాలికల్లో 92శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో 3,927 స్కూళ్లలో 100శాతం ఫలితాలు వచ్చాయి. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయి. నిర్మల్ 99.06శాతంతో మొదటి స్థానంలో ఉంది. వికారాబాద్ అత్యల్పంగా 66శాతం ఫలితాలను సాధించినట్టు కార్యదర్శి వెల్లడించారు.
TS SSC 10th Results 2024 Live: ఫలితాలు విడుదల
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరిగాయి. 19 కేంద్రాల్లో 9 రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ జరిగినట్టు కార్యదర్శి వెల్లడించారు.
TS SSC 10th Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.
TS SSC 10th Results 2024 Live: మరికాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ BSE పదో తరగతి పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం ఈ లింకును నొక్కండి… https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
TS SSC 10th Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
విద్యార్ధి రోల్ నంబర్, హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేసి తెలంగాణ పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చు.
TS SSC 10th Results 2024 Live: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు… ఈ లింకు ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
TS SSC 10th Results 2024 Live: TS BSE పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలను హెచ్ టి తెలుగు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింకును ఫాలో అవ్వండి. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
ఫలితాలను విడుదల చేయనున్న కార్యదర్శి బుర్రా వెంకటేశం
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం Secretary Education హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
TS SSC 10th Results 2024 Live Updates: హిందుస్తాన్ టైమ్స్ లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్‌లో వేగంగా తెలుసుకోవచ్చు.
Manabadi TS SSC 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు
BSE ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యదర్శి ఫలితాాలను వెల్లడిస్తారు. పదో తరగతి ఫలితాలు హెచ్ టి తెలుగులో తెలుసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్న BSE
Manabadi: తెలంగాణ Telangana పదో తరగతి పరీక్షా ఫలితాలను ఉదయం 11 గంటలకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ BSE అధికారులు విడుదల చేయనున్నారు.
గత ఏడాది కంటే ముందే ఫలితాలు…
గత ఏడాది కంటే ముందే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యదర్శి తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు.
మరికాసేపట్లో తెలంగాణ పది ఫలితాలు
తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరికాసేపట్లో విడుదల చేయనుంది.
TS 10th Class Results 2024: ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పది ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.cgg.gov.in లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
TS 10th Class Results 2024: ఈసీ అనుమతితో ఫలితాల విడుదల
TS 10th Class Results 2024: 2023లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు…. మే 10వ తేదీన వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీతో పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది పరీక్షలు ముందుగా ప్రారంభం అయ్యాయి. మార్చి 18వ తేదీతో మొదలై ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తి అయ్యాయి. ఆ వెంటనే స్పాట్ మొదలైంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TS 10th Class Results 2024: ఏప్రిల్ 13తో పూర్తైన జవాబు పత్రాల మూల్యంకనం
TS 10th Class Results 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (TS SSC Spot Valuation 2024) ఇప్పటికే పూర్తైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభించారు. ఏప్రిల్ 13తో టెన్త్ స్పాట్ ప్రక్రియ పూర్తైంది. స్పాట్ వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో నిర్వహించారు.
TS 10th Class Results 2024: 2676 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
TS 10th Class Results 2024: ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
TS SSC Results 2024: ఫలితాలు విడుదల చేయనున్న బోర్డు సెక్రటరీ
తెలంగాణ పదో తరగతి ఫలితాలు (Telangana SSC Results 2024) మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 30న) ఉదయం 11 గంటలకు ఈ పరీక్షల ఫలితాల (TS 10th Results)ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు.
పది ఫలితాలపై పెన్ నంబర్
తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్(Permanent Education Number) నెంబర్ ముద్రించనున్నారు. ఉద్యోగార్థులకు ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన 'పెన్' నంబర్‌ను ముద్రించనుంది. పె న్ నెంబర్(Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్(Permanent Education Number) నెంబర్ ఆధారంగా… ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఫలితాలను విడుదల చేయనున్న సెకండరీ బోర్డు
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం ఉదయం హైదరాబాద్ లో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ పది పరీక్షలకు 5.08లక్షల మంది విద్యార్ధులు
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నేడు పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదలచేయనున్నారు.