తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Musi River Floods 2022: మూసీ ఉగ్రరూపం - బస్తీలను ముంచెత్తిన వరద

Musi River floods 2022: మూసీ ఉగ్రరూపం - బస్తీలను ముంచెత్తిన వరద

28 July 2022, 9:19 IST

Musi River floods 2022: మూసీ నది ఉప్పొంగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో… పరిస్థితి డేంజర్ గా మారింది. ఫలితంగా పరివాహక ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బుధవారం రాత్రి నుంచి కాస్త వరద ఉద్ధృతి తగ్గటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.

  • Musi River floods 2022: మూసీ నది ఉప్పొంగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో… పరిస్థితి డేంజర్ గా మారింది. ఫలితంగా పరివాహక ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బుధవారం రాత్రి నుంచి కాస్త వరద ఉద్ధృతి తగ్గటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి జంట జలాశయాలు కూడా తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు కాలనీల, బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
(1 / 7)
వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి జంట జలాశయాలు కూడా తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు లోతట్టు కాలనీల, బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.(PTI)
బుధవారం మూసారాంబాగ్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది.  దీంతో వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్ పేట్ --మలక్ పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
(2 / 7)
బుధవారం మూసారాంబాగ్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది.  దీంతో వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్ పేట్ --మలక్ పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.(PTI)
మూసీ వరద ధాటికి చాదర్‌ఘాట్‌ నుంచి మూసారంబాగ్‌ వరకు నది పక్క బస్తీలలో పెద్దఎత్తున ఇళ్లు నీట మునిగాయి. సుమారు 3 వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 
(3 / 7)
మూసీ వరద ధాటికి చాదర్‌ఘాట్‌ నుంచి మూసారంబాగ్‌ వరకు నది పక్క బస్తీలలో పెద్దఎత్తున ఇళ్లు నీట మునిగాయి. సుమారు 3 వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. (AP)
మూసీకి ఈస్థాయిలో వరదలు రావడానికి కారణం ఎగువన కురుస్తున్న వర్షాలే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దారూర్ లో 103, వికారాబాద్ లో 98 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
(4 / 7)
మూసీకి ఈస్థాయిలో వరదలు రావడానికి కారణం ఎగువన కురుస్తున్న వర్షాలే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దారూర్ లో 103, వికారాబాద్ లో 98 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.(AP)
భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో... మూసీకి మరింత ప్రవాహం పెరింది. 2020 అక్టోబరు నాటి వరదల్లో హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద చేరడంతో మూసీలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం కూడా హిమాయత్‌సాగర్‌ నుంచి 8 గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి విడిచిపెడుతున్నారు.
(5 / 7)
భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో... మూసీకి మరింత ప్రవాహం పెరింది. 2020 అక్టోబరు నాటి వరదల్లో హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద చేరడంతో మూసీలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం కూడా హిమాయత్‌సాగర్‌ నుంచి 8 గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి విడిచిపెడుతున్నారు.(AP)
ఈ తరహా వరదలు 2003 ఆగస్టులో వచ్చాయని మూసీ పరివాహాక ప్రాంతాల్లోని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈసారే వచ్చాయని... వరద దాటికి ఇళ్లన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(6 / 7)
ఈ తరహా వరదలు 2003 ఆగస్టులో వచ్చాయని మూసీ పరివాహాక ప్రాంతాల్లోని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈసారే వచ్చాయని... వరద దాటికి ఇళ్లన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.(PTI)
మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్‌స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
(7 / 7)
మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్‌స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి