తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak T20 World Cup Live Updates: ఇదే నా బెస్ట్‌ ఇన్నింగ్స్‌: విరాట్‌
విరాట్ కోహ్లి ఛాంపియన్ ఇన్నింగ్స్
విరాట్ కోహ్లి ఛాంపియన్ ఇన్నింగ్స్ (AP)

Ind vs Pak T20 World Cup Live Updates: ఇదే నా బెస్ట్‌ ఇన్నింగ్స్‌: విరాట్‌

23 October 2022, 17:47 IST

Ind vs Pak T20 World Cup: కింగ్ కోహ్లి ఛాంపియన్ ఇన్నింగ్స్ తో పాకిస్థాన్ ను 4 వికెట్లతో చిత్తు చేసింది ఇండియా. విరాట్ 53 బాల్స్ లోనే 82 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

23 October 2022, 17:47 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ఇదే నా బెస్ట్‌ ఇన్నింగ్స్‌: విరాట్‌ కోహ్లి

పాకిస్థాన్‌పై ఆడిన ఈ విన్నింగ్‌ ఇన్నింగ్సే తన టీ20 కెరీర్‌లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని అన్నాడు విరాట్ కోహ్లి. ఈ మ్యాచ్‌లో అసలు ఆశలే లేని స్థితి నుంచి హార్దిక్‌తో కలిసి ఇండియాకు సంచలన విజయం సాధించి పెట్టాడు కోహ్లి. కేవలం 53 బాల్స్‌లోనే 82 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ తర్వాత విరాట్ మాట్లాడుతూ.. "ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. మనం గెలవగలమని హార్దిక్‌ చెబుతూ వచ్చాడు. నాకు మాటలు రావడం లేదు. షహీన్‌ పెవిలియన్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసినప్పుడే అతన్ని టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్లూ మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్సే బెస్ట్‌ అని చెప్పేవాన్ని. అయితే మ్యాచ్‌కు ఉన్న ప్రాముఖ్యతను చూస్తే ఈ ఇన్నింగ్సే బెస్ట్‌ అని చెప్పగలను" అని విరాట్‌ అన్నాడు.

23 October 2022, 17:25 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 4 వికెట్లతో గెలిచిన ఇండియా

విరాట్‌ కోహ్లి ఛాంపియన్‌ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను 4 వికెట్లతో ఓడించింది ఇండియా. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం ఉండగా.. ఎంతో ఉత్కంఠ, మలుపుల మధ్య చివరి బంతికి ఇండియా విజయం సాధించింది. విరాట్‌ కోహ్లి 53 బాల్స్‌లో 82 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.

23 October 2022, 17:10 IST

Ind vs Pak T20 World Cup Live Updates: చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు

పాకిస్థాన్‌పై ఇండియా గెలవాలంటే చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. 19వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు కొట్టిన విరాట్ కోహ్లి మ్యాచ్‌పై ఆశలు రేపాడు.

23 October 2022, 17:06 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 12 బంతుల్లో 31.. ఆశలు రేపిన విరాట్‌

విరాట్ కోహ్లి ఆశలు రేపుతున్నాడు. ప్రస్తుతం ఇండియా 12 బంతుల్లో 31 రన్స్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే సమీకరణం కష్టంగానే ఉన్నా.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా ఇంకా క్రీజులో ఉండటంతో మ్యాచ్‌పై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

23 October 2022, 17:00 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 18 బంతుల్లో 48.. ఇండియాకు కష్టమే

పాకిస్థాన్‌పై గెలవాలంటే ఇండియా ఇంకా 18 బంతుల్లోనే 48 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్‌, హార్దిక్‌ క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 81 రన్స్‌ జోడించారు.

23 October 2022, 16:56 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 24 బంతుల్లో 54.. ఇండియా గెలుస్తుందా?

పాకిస్థాన్‌పై ఇండియా గెలవాలంటే 24 బంతుల్లో 54 రన్స్‌ చేయాల్సి ఉంది. విరాట్, హార్దిక్ పోరాడుతున్నా.. పరుగులు అంత సులువుగా రావడం లేదు. ఇప్పటికే ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 75 రన్స్‌ జోడించారు.

23 October 2022, 16:50 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 100\4

ఇండియా 15 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లకు 100 రన్స్‌ చేసింది. విరాట్ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా పోరాడుతున్నారు. అయితే ఇప్పటికీ టార్గెట్‌ 30 బాల్స్‌లో 60 రన్స్‌ చేయాల్సి ఉంది. అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు.

23 October 2022, 16:38 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 12వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన ఇండియా

పాకిస్థాన్‌పై 12వ ఓవర్‌ ఇండియాకు భారీగా పరుగులు తెచ్చి పెట్టింది. ఈ ఓవర్లో హార్దిక్‌ రెండు, విరాట్‌ ఒక సిక్స్‌ బాదారు. దీంతో 12వ ఓవర్‌ ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లకు 74 రన్స్‌ చేసింది.

23 October 2022, 16:25 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 10 ఓవర్లలో ఇండియా 45\4

పాకిస్థాన్‌పై 160 రన్స్‌ చేజింగ్‌లో ఇండియా దారుణంగా ఆడుతోంది. తొలి సగం ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 రన్స్‌ మాత్రమే చేసింది. కోహ్లి, హార్దిక్‌ పాండ్యాలు కూడా ఆచితూచి ఆడుతున్నారు.

23 October 2022, 16:16 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 7 ఓవర్లలో ఇండియా 33/4

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇండియా చేతులెత్తేసేలా కనిపిస్తోంది. టాపార్డర్‌ దారుణ వైఫల్యంతో 7 ఓవర్లలో 4 వికెట్లకు 33 రన్స్‌ చేసింది.

23 October 2022, 16:13 IST

Ind vs Pak T20 World Cup Live Updates: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇండియా.. 31\4

ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. అక్షర్‌ పటేల్‌ (2) కూడా ఔటవడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

23 October 2022, 16:09 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన పవర్‌ ప్లే.. ఇండియా 31\3

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 160 రన్స్‌ చేజింగ్‌లో ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. పవర్‌ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 31 రన్స్‌ చేసింది.

23 October 2022, 16:07 IST

Ind vs Pak T20 World Cup Live Updates: సూర్యకుమార్‌ ఔట్‌.. పీకల్లోతు కష్టాల్లో ఇండియా

టాప్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఔటయ్యాడు. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 26 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది.

23 October 2022, 15:55 IST

Ind vs Pak T20 World Cup Live Updates: రోహిత్‌ కూడా ఔట్‌.. కష్టాల్లో ఇండియా

పాకిస్థాన్‌పై ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ ఇప్పటికే పెవిలియన్‌ చేరారు. హరీస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ (4) ఔటయ్యాడు.

23 October 2022, 15:48 IST

Ind vs Pak T20 World Cup Live Updates: తొలి వికెట్‌ కోల్పోయిన ఇండియా.. రాహుల్‌ ఔట్‌

ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. నసీమ్‌ షా బౌలింగ్‌లో రాహుల్‌ (4) బౌల్డయ్యాడు. దీంతో ఇండియా 7 రన్స్‌కే తొలి వికెట్‌ను నష్టపోయింది.

23 October 2022, 15:43 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన ఇండియా తొలి ఓవర్‌.. 5\0

ఇండియా ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ ముగిసింది. వికెట్‌ నష్టపోకుండా 5 రన్స్‌ చేసింది. రోహిత్‌ 3, రాహుల్‌ 2 రన్స్‌ చేసి అజేయంగా ఉన్నారు.

23 October 2022, 15:25 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన పాక్‌ ఇన్నింగ్స్‌.. ఇండియా టార్గెట్‌ 160

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ టీమ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 రన్స్‌ చేసింది. అర్ష్‌దీప్, హార్దిక్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. స్టార్‌ బ్యాటర్లు బాబర్‌, రిజ్వాన్‌ విఫలమైనా ఇఫ్తికార్‌, షాన్‌ మసూద్‌ హాఫ్‌ సెంచరీలతో పాక్‌కు మంచి స్కోరు అందించారు.

23 October 2022, 15:17 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 19వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 149\7

పాకిస్థాన్‌ 19 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లకు 149 రన్స్‌ చేసింది. అర్ష్‌దీప్‌ తన చివరి ఓవర్లో 14 రన్స్‌ సమర్పించుకున్నాడు. షహీన్‌ అఫ్రిది ఓ సిక్స్‌, ఫోర్‌ బాదాడు.

23 October 2022, 15:11 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 18వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 135\7

పాకిస్థాన్‌ 18 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లకు 135 రన్స్‌ చేసింది. హార్దిక్‌, అర్ష్‌దీప్‌ చెరో మూడు వికెట్లు, షమి ఒక వికెట్‌ తీశాడు.

23 October 2022, 15:03 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ఏడో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 17వ ఓవర్లో తిరిగి బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్‌ తన మూడో వికెట్‌ తీసుకున్నాడు. ఆసిఫ్‌ అలీ (2) ఔటయ్యాడు. పాకిస్థాన్‌ 120 రన్స్‌ దగ్గర ఏడో వికెట్‌ కోల్పోయింది.

23 October 2022, 14:58 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ఆరో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు తీసుకున్నాడు. పాక్‌ 115 స్కోరు దగ్గర 6వ వికెట్‌ కోల్పోయింది. నవాజ్‌ (9) ఔటయ్యాడు.

23 October 2022, 14:53 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 15 ఓవర్లలో పాకిస్థాన్‌ 106\5

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 15 ఓవర్లు ముగిసింది. ఆ టీమ్‌ 5 వికెట్లకు 106 రన్స్‌ చేసింది.

23 October 2022, 14:47 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన హార్దిక్‌

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. హైదర్‌ అలీ (2) ఔటయ్యాడు. దీంతో పాక్ 98 రన్స్‌ దగ్గర ఐదో వికెట్‌ కోల్పోయింది.

23 October 2022, 14:43 IST

Ind vs Pak T20 World Cup Live Updates: నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. షాదాబ్‌ ఖాన్‌ 5 రన్స్‌ చేసి ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యాకు వికెట్‌ దక్కింది. పాక్‌ 96 రన్స్‌ దగ్గర నాలుగో వికెట్‌ కోల్పోయింది.

23 October 2022, 14:41 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 13 ఓవర్లు ముగిసే సమయానికి 96\3

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ముగిశాయి. ఆ టీమ్‌ 3 వికెట్లకు 96 రన్స్ చేసింది. అర్ష్‌దీప్‌ 2, షమి ఒక వికెట్‌ తీసుకున్నారు.

23 October 2022, 14:38 IST

Ind vs Pak T20 World Cup Live Updates: మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51)ను మహ్మద్‌ షమి ఔట్‌ చేశాడు. పాకిస్థాన్‌ 91 రన్స్‌ దగ్గర మూడో వికెట్‌ కోల్పోయింది.

23 October 2022, 14:36 IST

Ind vs Pak T20 World Cup Live Updates: 12వ ఓవర్లో 3 సిక్స్‌లు.. ఇఫ్తికార్‌ హాఫ్‌ సెంచరీ

అక్షర్‌ పటేల్‌ వేసిన 12వ ఓవర్లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ మూడు సిక్స్‌లు బాదాడు. అతడు 32 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు.

23 October 2022, 14:31 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 11వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 70\2

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిశాయి. అశ్విన్‌ వేసిన ఈ ఓవర్లో ఇన్నింగ్స్‌ తొలి సిక్స్‌ బాదాడు ఇఫ్తికార్‌ అహ్మద్‌. దీంతో పాకిస్థాన్‌ 2 వికెట్లకు 70 రన్స్‌ చేసింది.

23 October 2022, 14:26 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 10వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 60\2

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. ఓపెనర్లు ఇద్దరూ త్వరగానే ఔటైనా.. షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరూ మెల్లగా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పాక్‌ 10 ఓవర్లలో 2 వికెట్లకు 60 రన్స్‌ చేసింది.

23 October 2022, 14:22 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 9వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 50\2

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు ముగిశాయి. ఆ టీమ్‌ 50 రన్స్‌ చేసి 2 వికెట్లు కోల్పోయింది. తొలిసారి ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ రూపంలో స్పిన్నర్‌ను రంగంలోకి దించాడు రోహిత్‌. అతడు తొలి ఓవర్లో 5 రన్స్‌ ఇచ్చాడు.

23 October 2022, 14:18 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 8వ ఓవర్‌.. పాకిస్థాన్‌ 44\2

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లు ముగిశాయి. ఆ టీమ్‌ 44 రన్స్‌ చేసి 2 వికెట్లు కోల్పోయింది. షమి మరో వికెట్‌ తీసినట్లు కనిపించినా.. థర్డ్‌ మ్యాన్‌ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్‌.. క్యాచ్‌ను సరిగా అందుకోలేకపోయాడు.

23 October 2022, 14:14 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన 7 ఓవర్లు.. పాకిస్థాన్ 41\2

ఇండియాతో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 7 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 41 రన్స్‌ చేసింది. షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో ఉన్నారు.

23 October 2022, 14:04 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ముగిసిన పవర్‌ ప్లే.. పాకిస్థాన్‌ 32\2

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్‌ 2 వికెట్లకు 32 రన్స్‌ చేసింది. పాక్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజం (0), రిజ్వాన్‌ (4) ఔటయ్యారు. ఈ ఇద్దరినీ అర్ష్‌దీప్‌ సింగ్‌ పెవిలియన్‌కు పంపించాడు.

23 October 2022, 13:56 IST

రెండో వికెట్ కోల్పోయిన పాక్‌

పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 4 ర‌న్స్‌కు ఔట‌య్యాడు. అర్ష‌దీప్ సింగ్ ఖాతాలో రెండో వికెట్ ఇది. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి పాకిస్థాన్ 15 ర‌న్స్ చేసింది.

23 October 2022, 13:51 IST

మూడు ఓవ‌ర్ల‌లో 10 ప‌రుగులు చేసిన పాక్‌

మూడు ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ 10 ర‌న్స్ చేసింది. రిజ్వాన్ 4, మ‌సూద్ 4 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక ఓవ‌ర్ వేసిన అర్ష‌దీప్ 9 ర‌న్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

23 October 2022, 13:46 IST

రెండు ఓవ‌ర్ల‌లో పాకిస్థాన్ స్కోర్ 6 ర‌న్స్‌

రెండు ఓవ‌ర్లు ముగిసే స‌రికి పాకిస్థాన్ ఆరు ప‌రుగులు చేసింది. రిజ్వాన్ 4 ర‌న్స్‌, మ‌సూద్ 1 ర‌న్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు.

23 October 2022, 13:42 IST

పాక్ కెప్టెన్ బాబార్ ఆజాం డ‌కౌట్‌

పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజాం డ‌కౌట్ అయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియ‌న్ చేరాడు. పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ అత‌డిని ఔట్ చేశాడు. ఒక్క ర‌న్‌కే పాకిస్థాన్ ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది

23 October 2022, 13:39 IST

ఫ‌స్ట్‌ ఓవ‌ర్‌లో ఒకే ర‌న్ ఇచ్చిన భువ‌నేశ్వ‌ర్‌

మొద‌టి ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంలో పాకిస్థాన్ ఓపెన‌ర్లు ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. తొలి ఓవ‌ర్‌లో కేవ‌లం ఒక్క ర‌న్ మాత్ర‌మే చేసింది పాకిస్థాన్‌. ఆ ర‌న్ కూడా వైడ్ రూపంలోనే వ‌చ్చింది.

23 October 2022, 13:30 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ప్రారంభమైన ఇండోపాక్ క్రికెట్ యుద్ధం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్ తో ఇండియా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

23 October 2022, 13:16 IST

Ind vs Pak T20 World Cup Live Updates: ఇండియాపై ఆడుతున్న పాకిస్థాన్‌ టీమ్‌ ఇదే

మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం, షాన్‌ మసూద్‌, షాదాబ్‌ ఖాన్‌, హైదర్‌ అలీ, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, ఆసిఫ్‌ అలీ, షహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, హరీస్‌ రవూఫ్‌

23 October 2022, 13:11 IST

Ind vs Pak T20 World Cup Live Updates: పాకిస్థాన్‌పై ఆడుతున్న ఇండియా తుది జట్టు ఇదే

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌

23 October 2022, 13:04 IST

Ind vs Pak T20 World Cup Live Updates: టాస్ గెలిచిన ఇండియా.. పాక్ బ్యాటింగ్

Ind vs Pak T20 World Cup Live Updates: పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. 

23 October 2022, 12:27 IST

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్‌పై ఐదు సార్లు ఇండియా విన్‌

20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా పాకిస్థాన్ ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఐదు మ్యాచుల్లో టీమ్ ఇండియా విజ‌యాన్ని సాధించ‌గా ఒకే ఒక‌సారి పాకిస్థాన్ విజ‌యాన్ని అందుకున్న‌ది.

23 October 2022, 11:15 IST

సీనియ‌ర్ల‌కే ఛాన్స్‌

పాకిస్థాన్‌తో జ‌రుగ‌నున్న‌ మ్యాచ్‌లో కొత్త కురాళ్ల కంటే అనుభ‌వానికే టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పెద్ద‌పీట వేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో కె.ఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ ఓపెన‌ర్లుగా బ‌రిలో దిగ‌బోతున్నారు. మూడో స్థానంలో విరాట్ బ్యాటింగ్ చేయ‌నున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య బ్యాటింగ్ దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు ప‌డుతోన్న పంత్‌ను ప‌క్క‌న‌పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే తుది జ‌ట్టులో దినేష్ కార్తిక్ ఉంటాడు. స్పిన్న‌ర్లుగా అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్‌ల‌కు చోటు ద‌క్కే ఛాన్స్ ఉంది. పేప్ భారాన్ని ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ మోయ‌బోతున్నారు. వారితో పాటు అర్ష‌దీప్‌సింగ్‌కు ఛాన్స్ రావ‌చ్చున‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

23 October 2022, 10:30 IST

నెట్స్‌లో చెమ‌టోడ్చిన టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్‌...

నేడు ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య జ‌రుగ‌నున్న మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉన్న‌ట్లు ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది. 70 శాతం వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. వ‌ర్షం కార‌ణంగా శ‌నివారం ఉద‌యం పాకిస్థాన్ ప్రాక్టీస్ చేయ‌లేక‌పోయింది. నైట్ ఫ్ల‌డ్‌లైట్స్ వెలుగులో పాకిస్థాన్ ప్లేయ‌ర్స్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. మ‌రోవైపు శ‌నివారం మ‌ధ్యాహ్నం నెట్స్‌లో చెమ‌టోడ్చుతూ టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ క‌నిపించారు

23 October 2022, 10:09 IST

నేడు ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ 12 రౌండ్ తొలి మ్యాచ్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా త‌ల‌ప‌డ‌బోతున్న‌ది. మెల్‌బోర్న్ వేదిక‌గా మ‌ధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి