తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Masam: కార్తీకమాసంలో ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే అశుభం

Karthika masam: కార్తీకమాసంలో ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే అశుభం

HT Telugu Desk HT Telugu

07 December 2023, 9:11 IST

    • karthika masam: కార్తీక మాసంలో ఉదయం నిద్రలేవగానే మీ మొహం అద్దంలో చూసుకుంటున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
కార్తీకమాసంలో ఉదయం నిద్రలేవగానే చేయకూడని పనులు ఇవే
కార్తీకమాసంలో ఉదయం నిద్రలేవగానే చేయకూడని పనులు ఇవే

కార్తీకమాసంలో ఉదయం నిద్రలేవగానే చేయకూడని పనులు ఇవే

కార్తీక మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూ దీపాలు వెలిగిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

విశిష్టమైన కార్తీక మాసంలో ఆచరించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. లేదంటే శివుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఈ మాసంలో నిష్టగా దీపారాధన చేస్తే ఐశ్వర్యం, విజయాలు చేకూరతాయి.

2023 నవంబర్ 14 న ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ 13 తో పూర్తవుతుంది. నెల రోజుల పాటు ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేయడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే మరికొన్ని పనులు చేయాలి. అవి ఏంటో తెలుసుకుందాం..

అద్దం చూడకూడదు

నిద్రించే గదిలో అద్దం పెట్టుకోకూడదు. ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి మొహం అద్దంలో చూసుకోవడం అలవాటు. కానీ కార్తీక మాసంలో నిద్ర లేచిన వెంటనే మొహం అద్దంలో చూసుకోవడం మంచిది కాదు. అలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది.

దీపం చూడాలి

కార్తీక మాసం చలికాలంలో ఉంటుంది. చల్లదనం నుంచి ఉపశమనం పొందటం కోసం ఉదయం నిద్రలేవగానే వెలుగుతున్న దీపాన్ని చూసి హారతి కళ్ళకు అద్దుకున్నట్టు అద్దుకోవాలి. దీపం లేకపోతే వెలుగుతున్న దీపం ఫోటో అయినా చూసుకోవచ్చు. దీప కాంతి చూడటం వల్ల మనసులో మంచి ఆలోచనలు వస్తాయి. మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

దీపం లేకపోతే అరచేతులు రుద్దుకుని ఆ వేడి కళ్ళకు అద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం మొత్తం వేడి ప్రవహిస్తుంది.

విష్ణు పూజ

పరమ శివుడికి ఇష్టమైన మాసం కనుక మహాదేవుడిని పూజిస్తారు. అలాగే మహా విష్ణు మూర్తిని తప్పనిసరిగా పూజించాలి. అలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. శుభం జరుగుతుంది.

నువ్వుల నూనెతో దీపం

కార్తీక మాసంలో పూజ చేసేందుకు, దీపాలు వెలిగించేందుకు నువ్వుల నూనె ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల దీపం నుంచి వచ్చే వేడి శరీరానికి మేలు చేస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

ఉపవాసం చేయాలి

కార్తీక మాసంలో ప్రతి సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉంటే మంచిది. మనసు దేవుడి మీద పెట్టి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు మనసు దేవుడి మీద పెట్టడం వల్ల ఉపవాస ఫలం లభిస్తుంది. శుభ్రంగా స్నానం చేసి శివుడికి పూజ చేసి దీపం వెలిగించాలి. రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసి తీర్థాన్ని సేవించి ఉపవాసం విరమించాలి. ఉపవాసం చేయడం దేవుడి కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

వీటితో పూజ చేయాలి

విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిస పువ్వు, గరిక, దర్బలని సమర్పించాలి. శివుడికి ఇష్టమైన బిల్వ దళాలు, జిల్లేడు పూలతో పూజ చేస్తే శివ, వైష్ణవుల అనుగ్రహం పొందుతారు. ఈ సమయంలో దానాలు చేయడం మంచిది.

తదుపరి వ్యాసం