తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే

వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే

HT Telugu Desk HT Telugu

10 December 2023, 7:01 IST

    • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 16 వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

తెలుగు రాశిఫలితములు (వార ఫలితము) 10. 12.2023 నుండి 16. 12.2023 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : కార్తీకం

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అధికారుల సహాయ సహకారాలతో పనులు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. వ్యవసాయదారులకు కలసి వస్తుంది. సంతోషంగా గడుపుతారు. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగవచ్చు. విద్యార్థులకు ఆశాజనకం. రావలసిన డబ్బు అందుతుంది. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. బంధువర్గంతో చిన్నపాటి అభిప్రాయభేదాలు ఉన్నా పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉ టుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్దాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా అనుకూలం. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం అవసరం. విద్యార్థులకు అనుకూలమైన వారం. అయినా శ్రమించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో భేదాభిప్రాయాలు రావచ్చు. అందరినీ కలుపుకొని పోవాలి. ఏకాగ్రతతో పనులు చేస్తారు. డబ్బు అలస్యంగా అందడం వల్ల కొన్ని పనులలో జాష్యం జరగవచ్చును. వ్యవసాయదారులకు అనుకూలిస్తుంది. మిథునరాశివారు ఈ వారం మరింత శు భఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. ఉన్నత విద్య ప్రయత్నాలు కలసివస్తాయి. ఉన్నత స్థాయిలో నిలుస్తారు. మంచి కొలువులో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారం లఖిస్తుంది. ఇంటాబయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పరించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కళాకారులకు అదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులు కలసివస్తాయి. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమజంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూముల, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారం కలసివస్తుంది. ప్రభుత్వ పనులలో జాష్యం జరగవచ్చు. ఖర్చులు పెరిగినా కోర్టు కేసులలో సత్ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. పెద్దల సలహాలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం ఎదుర్కొంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టులో అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గౌరవమర్యాదలు పొందుతారు. సంతోషంగా పనులు పూర్తిచేస్తారు. వృథా ఖర్చులు ఉండవచ్చు. వ్యవయాలపై నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం. ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పరించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిలిచిపోయిన అనుకూలత ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం. కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలసివస్తాయి. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు పొందుతారు. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి సిబ్బంది సహకారం లఖిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. ఉన్నత విద్య ప్రయత్నాల్లో జాష్యం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. ప్రారంభించిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొత్తానికి పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రాబడిలో అస్థిరత వల్ల పనులలో జాష్యం జరుగుతుంది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. పెద్దల సలహాలు, సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల పట్ల రెట్టింపు జాగ్రత్త అవసరం. కొనుగోళ్ళు వాయిదా పడవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం. కళాకారులకు అనుకూలిస్తుంది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పరించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పెద్దలతో గౌరవంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రారంభించిన పనులను లాభదాయకంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం