తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలితాలు : ఈ వారం రాశి ఫలాలు.. వీరికి వాహనాలతో ఇబ్బందులు.. జాగ్రత్త

వార ఫలితాలు : ఈ వారం రాశి ఫలాలు.. వీరికి వాహనాలతో ఇబ్బందులు.. జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

26 November 2023, 4:30 IST

    • Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

తెలుగు రాశిఫలితములు (వార ఫలితము) 26.11.2023 నుండి 2.12.2023 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : కార్తీకం

లేటెస్ట్ ఫోటోలు

మే 21, రేపటి రాశి ఫలాలు.. రేపు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు

May 20, 2024, 08:19 PM

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

మేష రాశి

మేషరాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు పెరుగుతాయి. ఆత్మన్యూనతాభావాలతో సతమతమయ్యే సూచనలున్నాయి. కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశాలున్నాయి. వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా మీ యత్నాలుండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూల సమయం. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వ్యక్తిగతంగా ఎదగడానికి అవకావాలు కలసివస్తాయి. కుటుంబంలో మీదైన తరహా అభిప్రాయాలను ప్రకటించి అమలుచేస్తారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో పాలుపంచుకోవలసి వచ్చినపుడు మీ పరిధిని గుర్తెరిగి వ్యవహరించుకోవాలి. వివాహ, ఉద్యోగ వృద్ధిని పొందుతారు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. మీ ఆలోచనల్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక సర్దుబాట్లు అవసరమౌతాయి. చిన్న చిన్న అవరోధాలున్నా అధిగమించగల్లుతారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా సాగుతారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టగలరు. ఇంటా బయటా పరిస్థితుల్ని అనుకూలంగా మార్పు చేసుకోగలరు. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పరించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ ఫలితాలుంటాయి. కొన్ని ప్రయత్నాలకు దూరంగా ఉండండి. ఇతరుల ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉంటూ మీ ప్రయత్నాలను చేసుకోండి. కుటుంబంలో అనవసర చర్చలు చేసి బంధువర్గానికి దూరమవ్వగల సూచనలున్నాయి. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం అనుకూలంగా లేదు. మీ వ్యక్తిగత విషయాల్లో ప్రయోజనాలున్నాయి. సమస్యలను దూరం చేసుకోగల్గుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేసుకోగలుగుతారు. చిన్న చిన్న వివాదాలు ఉంటున్నా ఉత్సాహంగా పరిష్కరించుకుంటారు. భూ, గృహ క్రయవిక్రయాలు అనుకూలించును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. పట్టుదల, క్రమశిక్షణ చూసి ప్రయత్నాలను వేగవంతం చేసుకోగలరు. లక్ష్యాలు ఏర్పరచుకొని ప్రయత్నిస్తే అన్నింటా మీదే విజం అవ్వగలదు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక సామాన్యతలుంటాయి. వృత్తి వ్యాపారాలలో మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మార్పులకు దూరంగా ఉండాలి. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ఏర్పడతాయి. ఇంటా బయటా మీపట్ల వ్యతిరేకంగా ఉంటారు. వాగ్వాదాలలో ఆలోచనలకు ప్రాధాన్యతనీయండి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులుంటాయి. చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చి వ్యహరించుకోండి. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. పని ఒత్తిళ్ళు అధికమగును. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. అదాయల్లో మార్పులు ఏర్పడతాయి. కొత్త ఆదాయాలపై దృష్టిపెడతారు. కుటుంబంలో సమిష్టి యత్నాలుంటాయి. చిన్న తరహా తీర్థయాత్రలకు ప్రాధాన్యతనిస్తారు. మీ వ్యక్తిగత విషయాలకు ఇతరుల ప్రమేయాలను దూరంగా ఉంచండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. వాహన యంత్రాదులచే ఇబ్బందులు ఉండు సూచనలున్నాయి. ఉద్యోగాల్లో అధికారులచే ఒత్తిడులుంటాయి. పొదుపు పథకాలు వాయిదా పడకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంటాబయటా సహాయ నిరాకరణలుంటాయి. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. మీరు చేసే ప్రయత్నాలు వేగవంతం చేసుకోవాలి. స్థిరాస్తుల పట్ల మక్కువ పెరుగుతుంది. మిత్రవర్గం నుండి సహాయాల్ని పొందగలరు. ప్రభుత్వ తరహా బుణాలకు అనుమతులు ఏర్పడతాయి. ఊహించుకున్న వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పరించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉన్నది. మీ వ్యక్తిగత ఉత్సాహకరమైన స్థితులుంటాయి. ప్రయత్నించుకొనుచున్న పనులు అనుకూలిస్తాయి. సమయపాలనపై దృష్టిపెట్టగలిగివి విజయం మీదవుతుంది. ఆర్థికంగా సమర్ధించుకొను స్థితులు ఉంటాయి. కుటుంబాలకు సంయమనాలకు ప్రాధాన్యతనివ్వండి. నిరుద్యోగులకు చిన్నతరహా ప్రయోజనాలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారములు మధ్యస్థముగా ఉంటాయి. కుంభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. గతంతో పోల్చితే కొంత అనుకూలంగా ఉండి కొన్ని పనుల్ని పూర్తిచేసుకోగలరు. బంధుమిత్రుల సహాయాలు ఏర్పరచుకోగలుగుతారు. ప్రయత్నాల్ని వేగవంతం చేయుటలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు అవసరం. నూతన వ్యక్తుల పరిచయాల్లో సందేహబుద్ధితోనే సాగండి. అవసరాలను సమర్థించుకొను ఆదాయాలు ఉంటాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం