తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 6 : నేటి రాశి ఫలాలు.. వీరికి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది

డిసెంబర్ 6 : నేటి రాశి ఫలాలు.. వీరికి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu

06 December 2023, 4:05 IST

    • Today Horoscope In Telugu : నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.12.2023 బుధవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 6.12.2023, వారం: బుధవారం, తిథి : నవమి, నక్షత్రం : ఉత్తర, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేః గర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల సమయం. ఎదుటివారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విదార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లావాదేవాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిళ్ళు తగ్గుతాయి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్లశు భఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు కొత్త పదవులు లభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీయోగం. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆదాయం మెరుగ్గా ఉన్నా ఖర్చులు కూడా అధికం. ఇతరులకు చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గతం నుంచి వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు నిదానంగా సాగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు. దూర ప్రయాణాలు. మానసిక ఆందోళన ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. జీవితాశయం నెరవేరుతుంది. శుభ కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు తప్పవు. కొంత శ్రమ పెరుగుతుంది. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలం. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనులు చకాచకా పూర్తికాగలవు. నూతన వ్యక్తుల పరిచయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. దుబారా ఖర్చులుంటాయి. ఇంటా బయటా సమస్యలు ఉంటాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల సమయం. ఆదాయం సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారి సహకరిస్తారు. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్చించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదర, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్తగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో రాజీ తప్పదు. భూవివాదాలు, కోర్టు కేసులు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం